కరోనాతో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-04-13T06:36:45+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం కరోనాతో ముగ్గురు మృతిచెందగా కరోనా పాజిటివ్‌ బాధితు ల సంఖ్య భారీగా నమోదైంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకో ట గ్రామానికి చెందిన వృద్ధుడు (74) బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నా డు.

కరోనాతో ముగ్గురి మృతి
చెర్వుగట్టు దేవస్థాన ఉద్యోగులకు కరోనా నియంత్రణ కిట్స్‌ అందిస్తున్న వైద్య సిబ్బంది

చెర్వుగట్టు ఆలయంలో 15మందికి పాజిటివ్‌

ముగ్గురు అర్చకులు, 12మంది సిబ్బందికి నిర్ధారణ

మూడు రోజులు ఆలయం మూసివేత

మోత్యాతండాలో 61మందికి పాజిటివ్‌



నల్లగొండ, నార్కట్‌పల్లి, చందంపేట, ఏప్రిల్‌ 12 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం కరోనాతో ముగ్గురు మృతిచెందగా కరోనా పాజిటివ్‌ బాధితు ల సంఖ్య భారీగా నమోదైంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన వృద్ధుడు (74) బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. అందులో భాగంగా వారం క్రితం మంచిర్యాల జిల్లాలో నలుగురు వ్యక్తులతో కలిసి కథలు చెప్పి ఈ నెల 11వ తేదీన స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే జ్వరం గా ఉండడంతో నాగారం పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అప్పటికే ఆయాస పడుతుండగా సూర్యాపేటకు తరలించగా అక్కడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. బంధువులు మృతదేహాన్ని వర్ధమానుకోటకు తీసుకెళ్లి కరోనా నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గౌరికుంటతండాకు చెందిన వృద్ధురాలు(80) కరోనాతో చికిత్స పొందుతోంది. హోం క్వారంటైన్‌లో ఉంటూ పరిస్థితి విషమించి మృతిచెందింది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు(65) హోంక్వారంటైన్‌లో ఉంటూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లాలో సో మవారం ఒక్కరోజే 3967టెస్టులు చేయగా 450పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


హోలీ ఆట... కరోనా బాట

గత నెల 29వ తేదీన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గౌరికుంటతండాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న చందంపేట మండలం మోత్యతండా వాసులకు 61మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామస్థులు రెండు, మూడు రోజులుగా జ్వరం, దగ్గు, వాంతులు, రిరేచనాలతో బాధపడుతూ వైద్యాధికారులకు సమాచారం అందించారు. దీంతో చందంపేట పీహెచ్‌సీ వైద్యాధికారి విజయ ఆధ్వర్యంలో వైద్యబృందం సోమవారం 121మందికి పరీక్షలు నిర్వహించగా 61మందికి పాజిటివ్‌ వచ్చింది. తండాలో 525మంది జనాభా ఉండగా; అందరికీ నిర్ధారణ పరీక్షలు చేస్తామని వైద్యాధికారి తెలిపారు. గౌరికుంటతండాలో హోలీ ఆడేందుకు వెళ్లిన మోత్యాతండావాసులకు పాజిటివ్‌ రావటంతో; తండావాసులు బయటకు రావద్దని, బయటి వారిని తండాలోనికి రానివ్వకుండా కట్టడి చేయాలని పరిసర తండాలవాసులు నిర్ణయించుకున్నారు. 


చెర్వుగట్టులో 15మందికి పాజిటివ్‌ 

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 45మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ప్రఽధాన అర్చకుడితో పాటు మరో ఇద్దరు సహ అర్చకులు, 12మంది సిబ్బందికి పా జిటివ్‌ వచ్చింది. వాస్తవానికి రెండు రోజులుగా అమావాస్య కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గుట్టపై రాత్రి నిద్రకు అనుమతి లేదని ముం దుగానే ప్రకటించినా భక్తులను నిలువరించలేకపోయారు. దేవస్థానంలో ఉద్యోగు లు, అర్చకులు కరోనా బారిన పడడంతో మూడు రోజుల పాటు దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఈవో సులోచన తెలిపారు. దేవదాయ కమిషనర్‌ సూచన మేరకు కేవలం అర్చకులతోనే స్వామి వారి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తామన్నారు.


ఒక్కరోజే 1140మందికి కొవిషీల్డ్‌ టీకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పీహెచ్‌సీ సిబ్బంది సోమవా రం ఒక్కరోజే 1140మందికి కోవిషీల్డు వ్యాక్సిన్‌ వేశారు. వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 30మంది సిబ్బంది ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల కు నిర్విరామంగా టీకా కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2021-04-13T06:36:45+05:30 IST