Abn logo
May 24 2020 @ 12:09PM

ముగ్గురిని బలిగొన్న భార్యాభర్తల గొడవ

  • పిల్లలు మృతి చెందగా..
  • చికిత్స పొందుతూ తల్లి మృతి 
  • మూడు రోజుల క్రితం ఘటన 

రంగారెడ్డి/శామీర్‌పేట రూరల్‌ : ఇద్దరు పిల్లలకు పెయింట్‌ ఆయిల్‌ తాగించి తానూ తాగిన ఘటనలో పిల్లలు మృతి చెందగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఇన్‌స్పెక్టర్‌ సంతోషం తెలిపిన కథనం ప్రకారం కర్నూలు జిల్లా ఆధోని గ్రామానికి చెందిన గోపినాథ్‌వరంగల్లులోని అనాథాశ్రమంలో ఉంటున్న ప్రీతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరు కొంతకాలంగా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌ ప్రజయ్‌హోమ్స్‌లో ఉంటున్నారు. గోపీనాథ్‌ ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ప్రీతి ఇంట్లోనే ఉండేది. గోపీనాథ్‌ తరచూ భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రీతి ఈ నెల 20న తన  ఇద్దరు పిల్లలకు టార్పెంట్‌ ఆయిల్‌ తాగించి తానూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు చిన్నారులు అదే రోజు మృతిచెందగా, ప్రీతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు సీఐ సంతోషం తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement