stampede at Khatu Shyam temple: ఖాతు శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-08-08T15:03:29+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో(stampede) ముగ్గురు భక్తులు (three dead) మరణించారు....

stampede at Khatu Shyam temple: ఖాతు శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట...ముగ్గురి మృతి

పలువురికి గాయాలు...ఆసుపత్రికి తరలింపు

సికార్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో(stampede) ముగ్గురు భక్తులు (three dead) మరణించారు. సికార్ జిల్లాలోని(Rajasthans Sikar district) ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో( Khatu Shyam temple) సోమవారం ఉదయం జరిగిన నెలవారీ జాతర సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.జాతర సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఖాతూ శ్యామ్ జీ ఆలయాన్ని తెరిచారు. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. 


ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మరణించారు. మృతుల్లో ఒకరిని గుర్తించారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మరో ఇద్దరు భక్తులను జైపూర్ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Rajasthan Chief Minister Ashok Gehlot) తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆలయంలో భక్తుల మృతిపై ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) కూడా విచారం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-08-08T15:03:29+05:30 IST