the rains: 31వ తేదీ వరకు వర్షాలు

ABN , First Publish Date - 2022-07-29T13:45:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు కోస్తాతీర ప్రాంతంపై ఏర్పడివున్న ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని

the rains: 31వ తేదీ వరకు వర్షాలు

                                - వాతావరణ శాఖ వెల్లడి 


అడయార్‌(చెన్నై), జూలై 28: ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు కోస్తాతీర ప్రాంతంపై ఏర్పడివున్న ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం(Chennai Meteorological Centre) తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కన్నియాకుమారి(Kanniyakumari), తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, రామానాథపురం, విరుదునగర్‌, తేని, దిండిగల్‌, మదురై, శివగంగై, కోయంబత్తూరు, తిరుపూరు, నీలగిరి, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, కరూర్‌, నామక్కల్‌, తిరుచ్చి, పుదుక్కోట, తంజావూరు, తిరువారూరు, పెరంబలూరు, అరియలూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. అలాగే, గురువారం కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపు జల్లులు పడ్డాయి.ఈనెల 30, 31వతేదీవరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల(Thunder and lightning)తో కూడిన తేలికపాటివర్షం కురుస్తుందనితెలిపింది. నీలగిరి, కోవై, తిరుపూరు, తేని,దిండిగల్‌, సేలం, ధర్మపురి, కళ్లకుర్చి, కరూర్‌, నామక్కల్‌, తిరుచ్చి, తంజావూరు, పుదుక్కోట, పెరంబలూరు, మైలాడుదురై, అరియలూరు, కడలూరు జిల్లాలు, కారైక్కాల్‌ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది. చెన్నైలో వచ్చే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.  

Updated Date - 2022-07-29T13:45:01+05:30 IST