నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు

ABN , First Publish Date - 2022-05-24T14:54:20+05:30 IST

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అగ్నినక్షత్రం ప్రారంభమైన

నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అగ్నినక్షత్రం ప్రారంభమైన తర్వాత పలు చోట్ల వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే రెండు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో తేలికపాటి  జల్లులు కురుస్తాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల మెరుపులు, పిడుగులతో వర్షం పడొచ్చని తెలిపింది. పుదుచ్చేరితో పాటు కారైక్కాల్‌ ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడొచ్చని వెల్లడించింది. చెన్నైలో వచ్చే 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు పడొచ్చని వెల్లడించింది. మధ్యతూర్పు బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకునివున్న ఉత్తర అండమాన్‌ సముద్రం ప్రాంతాంల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రాల్లో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. 

Updated Date - 2022-05-24T14:54:20+05:30 IST