Black buck Poachers కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

ABN , First Publish Date - 2022-05-14T15:57:08+05:30 IST

కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు దారుణానికి తెగబడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం వెలుగుచూసింది....

Black buck Poachers కాల్పుల్లో ముగ్గురు పోలీసుల మృతి

గుణ(మధ్యప్రదేశ్): కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు దారుణానికి తెగబడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం వెలుగుచూసింది.గుణ అటవీప్రాంతంలో శనివారం తెల్లవారుజామున కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు ఎదురుపడిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు.వేటగాళ్లు ముగ్గురు పోలీసు సిబ్బందిని కాల్చి చంపిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ సక్సేనా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గుణ పరిపాలనా విభాగం ఈ సమావేశానికి హాజరుకానున్నారు.సాయుధులైన వేటగాళ్లు  పోలీసు బృందంపై కాల్పులు జరిపారని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు.


దీనికి పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని, అయితే దట్టమైన అడవిని అడ్డుపెట్టుకొని వేటగాళ్లు తప్పించుకోగలిగారని మిశ్రా చెప్పారు.వేటగాళ్ల కాల్పుల్లో  సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్ లు మరణించారు. ఈ కాల్పుల్లో పోలీసు వాహనం డ్రైవర్ కూడా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.కృష్ణజింకలను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు ఈ ప్రాంతంలో విడిది చేస్తున్నారనే నిర్దిష్ట సమాచారంతో పోలీసు బృందం అడవికి వెళ్లింది.గుణ అటవీ ప్రాంతం నుంచి పలు కృష్ణజింకల కళేబరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Read more