Cheap Foreign Trips: విదేశీ యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా..? ఈ మూడు దేశాలకు వెళ్తే అతి తక్కువ ఖర్చు..!

ABN , First Publish Date - 2022-07-22T17:58:39+05:30 IST

విదేశీ టూర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, ఆ టూర్లకు అయ్యే ఖర్చులే మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి.

Cheap Foreign Trips: విదేశీ యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా..? ఈ మూడు దేశాలకు వెళ్తే అతి తక్కువ ఖర్చు..!

ఎన్నారై డెస్క్: విదేశీ టూర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, ఆ టూర్లకు అయ్యే ఖర్చులే మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి. అలాగని అన్ని దేశాల టూర్లు ఖరీదైనవి కావు. అమెరికా, యూరప్ దేశాలను మినహాయిస్తే ప్రపంచంలో చాలా దేశాలను చాలా తక్కువ వ్యయంతో వెళ్లిరావొచ్చు. ఈ జాబితాలో ప్రధానంగా మూడు దేశాలు ఉన్నాయి. భారతీయ పర్యాటకులు ఈ మూడు దేశాలను చాలా తక్కువ బడ్జెట్‌లో చుట్టిరావొచ్చు. ఇండోనేషియా, వియత్నా, లావోస్ ఈ మూడు దేశాల టూర్‌కు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ మూడు దేశాలలో మన ఇండియన్ రూపీ చాలా స్ట్రాంగ్. ఇది కూడా ఒక కారణం. ఇక ఆయా దేశాలలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలు, అక్కడ మన రూపాయి విలువ, సందర్శనకు అయ్యే వ్యయాలపై ఓ లుక్కేద్దాం.


1. ఇండోనేషియా 

ఆసియా ఖండంలోనే అత్యంత అందమైన దేశాలలో ఇండోనేషయా ఒకటి. ద్వీపాల దేశంగా పేరొందిన ఇండోనేషియా.. బ్లూ వాటర్, ఉష్ణమండల వాతావరణానికి ప్రత్యేకం. ఇక్కడ చాలా హిందూ, బుద్ధ ఆలయాలు ఉన్నాయి. బాలి ఇక్కడ అత్యంత ప్రసిద్ధ సందర్శన గమ్యస్థానాలలో ఒకటి. ఈ దేశం భారతీయులకు ఉచితంగా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. అంతేగాక ఇక్కడ మన రూపాయి విలువ చాలా ఎక్కువ. ఈ దేశంలో మన ఒక రూపాయి.. 188.11 ఇండోనేషియా రుపియాకు సమానం. కనుక చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఇండోనేసియాకు వెళ్లి రావొచ్చు.


2. వియత్నాం

దక్షిణ ఆసియాలో తప్పక సందర్శించాల్సిన దేశాలలో వియత్నాం కూడా ఉంటుంది. ఎంతో సుందరంగా ఉండే ఈ దేశానికి ప్రపంచంలోని చాలా దేశాల పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి సంస్కృతి చాలా ప్రత్యేకంగా. బౌద్ధ పగోడాలు, ప్రత్యేకమైన వియత్నామీస్ వంటకాలు, నదులకు ప్రసిద్ధి చెందిన దేశం. ఇక్కడి నదులలో మీరు కయాకింగ్(పడవలాంటి వాటిపై బోటింగ్) చేయవచ్చు. వియత్నాం సంస్కృతి భారతీయులకు ఖచ్చితంగా సరిపోతుందని చెప్పొచ్చు. యుద్ధ సంగ్రహాలయాలు, ఫ్రెంచ్ వలసరాజ్యాల నిర్మాణం దేశంలోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. వీటిని తప్పకుండా సందర్శించాల్సిందే. ఈ దేశంలో కూడా మన రూపాయి చాలా స్ట్రాంగ్. అందుకే చాలా తక్కువ ఖర్చుతోనే విజిట్ చేసే వీలుంది. ఇక్కడ మన రూపాయి విలువ.. 294.21 వియత్నాం డాంగ్‌కు సమానం. అంటే మన వంద రూపాయలు 29,421 డాంగ్‌కు సమానం. ఈ మనీతో అక్కడి చాలా బ్యూటిఫుల్ ప్రదేశాలను సందర్శించవచ్చు. 


3. లావోస్

మనం తప్పక సందర్శించాల్సిన దేశాలలో లావోస్ ఒకటి. ఈ దేశంలోని పర్యాటక ప్రదేశాలు కూడా కనులవిందుగా ఉంటాయి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతియేటా భారీ సంఖ్యలో సందర్శకులు లావోస్‌కు క్యూకడుతుంటారు. ఇక్కడి కరెన్సీ కీప్. ఇక్కడ కూడా మన రూపాయి విలువ చాలా ఎక్కువనే చెప్పాలి. మన ఒక రూపాయి 188 కీప్‌లకు సమానం. సో.. లావోస్ టూర్‌ను సైతం తక్కువ మొత్తంలోనే ముగించవచ్చు.  

Updated Date - 2022-07-22T17:58:39+05:30 IST