నిజామాబాద్: ఉపాధి కూలీపై మూడు ఎలుగుబంట్ల దాడి చేశాయి. జిల్లాలోని డిచ్పల్లి మండలం మాక్లూర్ తండ అటవీ ప్రాంతంలో సిర్ణపల్లి నడిపి సాయిలుపై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకొన్న సాయిలు గ్రామానికి చేరుకున్నాడు. ఉపాధి హామీ పథకంలో భాగంగా తునికాకు సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లగా ఎలుగుబంట్లు దాడికి పాల్పడ్డాయి.
ఇవి కూడా చదవండి