జల్సాల కోసం చోరీలు

ABN , First Publish Date - 2020-05-27T09:46:28+05:30 IST

జల్సాలకు అలవాటుపడి చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ యువకుడు, ఇద్దరు బాల

జల్సాల కోసం చోరీలు

ఇద్దరు బాలురు సహా ముగ్గురి అరెస్టు

రూ. 5 లక్షలు, నగలు స్వాధీనం


జీడిమెట్ల, మే 26 (ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటుపడి చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ యువకుడు, ఇద్దరు బాల నేరస్థులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం వివరాలు వెల్లడించారు. సూరారంకాలనీకి చెందిన గోపాల్‌ కుమారుడు దేరంగుల రవి(19) ఆటో డ్రైవర్‌. ఇద్దరు బాలురతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడిన వీరు జీడిమెట్ల, జగద్గిరిగుట్ట దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ల పరిధుల్లో ఆలయాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. రవి నెల రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. ఈనెల 17వ తేదీ రాత్రి ఇద్దరు బాలలతో కలిసి జీడిమెట్ల ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌లోని మునిసిపల్‌ శానిటరీ సూపర్‌వైజర్‌ ఎం.రాజే్‌షసింగ్‌ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. రూ. 5 లక్షలు, బంగారు నగలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వేలి ముద్రల ఆధారంగా నిందితులను మంగళవారం స్కూటీపై వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 5 లక్షలు, బంగారు నగలు, వెండి పట్టాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి రవిని రిమాండ్‌కు, బాల నేరస్థులను జువెనైల్‌ హోంకు తరలించారు.  

Updated Date - 2020-05-27T09:46:28+05:30 IST