పోలీసుల అదుపులో నిందితులు
గాజువాక, జనవరి 24: గాజువాక దరి గోపాలరెడ్డినగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను సోమవారం గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. అప్పు తీర్చలేదని గోపాలరెడ్డినగర్‌కు చెందిన ప్రసాద్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే హత్యకు పాల్పడిన సానిబోయిన శ్రీను, సానిబోయిన సింహాచలం, సానిబోయిన దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు గాజువాక సీఐ హెచ్.మల్లేశ్వరరావు తెలిపారు. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించిందని ఆయన వివరించారు.