తుపాకీతో బెదిరించి.. బంగారం అపహరణ

ABN , First Publish Date - 2022-07-03T05:24:40+05:30 IST

తుపాకీతో బెదిరించి.. బంగారం అపహరణ

తుపాకీతో బెదిరించి.. బంగారం అపహరణ
బాధితులతో మాట్లాడుతున్నఎస్పీ


  • వికారాబాద్‌ జిల్లా కులకచర్ల గ్రామ శివారులో ఘటన

కులకచర్ల, జూలైౖ2 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దంపతులను తుపాకీతో బెదిరించి బంగారం అపహరించిన ఘటన కులక చర్లగ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన జోగు చిన్న అంజిలయ్యగౌడ్‌ గ్రామ శివారులోని పొలం వద్ద ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ముఖానికి మంకీ క్యాపులు ధరించి  ఇంట్లోకి చొరబడ్డారు. చిన్న అంజిలయ్యను తుపాకీతో బెదిరించి.. భార్య అలివేలు ఒంటిపై ఉన్న 3 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొన్నారు. అంతేకాకుండా బీరువాను పగులగొట్టి తులంన్నర బంగారు కమ్మలను తీసుకొని తలుపులకు గడియపెట్టి పారిపోయారు.  బాధితుడు అదేరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, శనివారం ఘటన స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన దుండుగులను పట్టుకునేందుకు నాలుగు పోలీ్‌సబృందాలను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2022-07-03T05:24:40+05:30 IST