కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు

ABN , First Publish Date - 2022-05-22T05:16:29+05:30 IST

జాతీయ స్థాయిలోగానీ, ప్రాంతీయ స్థాయిలోగానీ, కాంగ్రెస్‌ మొదలుకొని టీఆర్‌ఎస్‌ వరకు కుటుంబ పార్టీలుగా మారాయని, వాటితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లనుందని, నిజాం వారసత్వ రాజకీయాలను అంతమొందించడం బీజేపీకే సాధ్యమని భారతీయ జనతా పార్టీ జాతీయ రఽపదాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.

కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
గంభీరావుపేటలో బీజేపీ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రథాన కార్యదర్శి మురళీధర్‌రావు

    - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

గంభీరావుపేట, మే 21:  జాతీయ స్థాయిలోగానీ, ప్రాంతీయ స్థాయిలోగానీ, కాంగ్రెస్‌ మొదలుకొని టీఆర్‌ఎస్‌ వరకు కుటుంబ పార్టీలుగా మారాయని, వాటితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లనుందని,  నిజాం వారసత్వ రాజకీయాలను అంతమొందించడం బీజేపీకే సాధ్యమని  భారతీయ జనతా పార్టీ జాతీయ రఽపదాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం జిల్లా స్థాయి బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ తరగతులకు మొదటి రోజు మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ  కటుంబ రాజకీయ వ్యవస్థను అంతమొందించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలన్నా.. అవినితీ లేని రాజకీయాలు తీసుకురావాలన్నా.. అవినితీ లేని ప్రభుత్వాలు నడపాలన్నా బీజేపీకే సాధ్యమన్నారు.  తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయంగా నిజాం వారసత్వ రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి నుంచి ప్రత్యామ్నాయంగా నిలబడే విధంగా బీజేపీ కార్యకర్తలకు శిక్షణకు ఇస్తున్నట్టు తెలిపారు.  జూన్‌ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా గడప గడపకు వెళ్లనున్నట్లు, ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, కొవిడ్‌ సమయంలో ఉచిత వ్యాక్సినేషన్‌, ఉచిత రేషన్‌ పంపిణీ వంటి అంశాలను కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించేందుకు సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 26న హైదరాబాద్‌కు నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. బూత్‌ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సాముహిక  శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 700పైగా జిల్లాల్లో తొమ్మిది లక్షల మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా ఇంచార్జీ మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమాకాంతారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోఫి, మండల అధ్యక్షుడు గంట అశోక్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, శిక్షణ తరగతుల ప్రముఖ్‌ రవీందర్‌, నాయకుడు ఎర్రం మహేష్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-22T05:16:29+05:30 IST