సంఘవ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు

ABN , First Publish Date - 2021-04-11T05:37:32+05:30 IST

సంఘవ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు.

సంఘవ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు
మాట్లాడుతున్న అప్పలసూర్యనారాయణ

 మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 10: సంఘవ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్యానికి ముప్పు  వాటిల్లుతోందని టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  1981లో  తాను రాజకీయరంగ ప్రవేశం చేశానని, ఎన్నికల్లో ఏనాడూ ధనం, మద్యం పంపిణీ చేయలేదన్నారు. కానీ, ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పువాటి ల్లేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తు తం ఏ ఎన్నికలు జరిగినా డబ్బు, మద్యం ఏరులై పారు తుందన్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిషత్‌ ఎన్నికల ను టీడీపీ బహిష్కరించిందని, కానీ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునేం దుకు అవకాశం లేక.. శ్రీకాకుళం మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పోటీలో నిల్చున్నారని చెప్పారు. గార మండల నాయకులందరూ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించారని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నాయక త్వాన్ని తాము అనుసరిస్తున్నట్లు తెలిపారు. 


 




Updated Date - 2021-04-11T05:37:32+05:30 IST