హాస్టళ్లు వెలవెల!

ABN , First Publish Date - 2022-01-21T05:25:58+05:30 IST

సంక్రాంతి సెలవులు అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలల పునఃప్రారంభమైనా విద్యార్థులు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావడం లేదు. కొవిడ్‌ భయంతో అత్యధికులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పాఠశాలలకు వెళ్లిన తరువాత తమ పిల్లలు కరోనా బారిన పడితే ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న ఆలోచ

హాస్టళ్లు వెలవెల!
వనజ పాఠశాలలో గురువారం హాజరైన విద్యార్థులు

హాస్టళ్లు వెలవెల!

కొవిడ్‌ భయంతో వసతిగృహాలకు రాని విద్యార్థులు

 పార్వతీపురం, జనవరి 20: సంక్రాంతి సెలవులు అనంతరం  గిరిజన ఆశ్రమ పాఠశాలల  పునఃప్రారంభమైనా విద్యార్థులు మాత్రం పూర్తిస్థాయిలో  హాజరుకావడం లేదు. కొవిడ్‌ భయంతో అత్యధికులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.  పాఠశాలలకు వెళ్లిన తరువాత తమ పిల్లలు కరోనా బారిన పడితే ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు.  గిరిజన విద్యాశాఖ పరిధిలో 55 ఆశ్రమ పాఠశాలలు ఉండగా అందులో 13,664 మంది  విద్యార్థులు ఉన్నారు. ఇందులో 50 శాతం కూడా నేటికి హాజరుకాని పరిస్థితి ఉంది. కురుపాం మండలం మొండెంఖల్లు ఆశ్రమపాఠశాలలో 162 మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 85 మంది మాత్రమే హాజరయ్యారు.    గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ఆశ్రమ పాఠశాలలో 472 మంది విద్యార్థులు ఉండగా కేవలం 290 మంది మాత్రమే హాజరయ్యారు.  జియ్యమ్మవలస మండలం రావిడ రామబధ్రపురం (ఆర్‌ఆర్‌బి పురం)లో 221 మంది ఉండగా కేవలం 15 మంది మాత్రమే వచ్చారు.   జియ్యమ్మవలస మండలం వనజ ఆశ్రమ పాఠశాలలో 73మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 40మంది హాజరయ్యారు.  కొమరాడ మండల కేంద్రంలో గల బాలికల ఆశ్రమ పాఠశాలలో 171మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 42మంది వచ్చారు.   కొమరావ మండలం ఉలిపిరి బాలికల ఆశ్రమ పాఠశాలలో 322మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 37మంది హాజరయ్యారు.   పార్వతీపురం మండలం డొకిశీల ఆశ్రమ పాఠశాలలో 202 మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 126మంది వచ్చారు.  ఇలా ఏ ఆశ్రమ పాఠశాలలో  చూసినా హాజరైన   విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.  


Updated Date - 2022-01-21T05:25:58+05:30 IST