కోలుకున్న తర్వాత కూడా... బీమా కష్టమే...

ABN , First Publish Date - 2021-05-11T20:11:24+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బీమా చేయించుకోవాలంటే కష్టమే. ఒకవేళ సాధ్యపడినప్పటికీ... పీమియంను మాత్రం అధిక మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఈ కథనం చదవండి...

కోలుకున్న తర్వాత కూడా... బీమా కష్టమే...

ముంబై : కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బీమా చేయించుకోవాలంటే కష్టమే. ఒకవేళ సాధ్యపడినప్పటికీ... పీమియంను మాత్రం అధిక మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఈ కథనం చదవండి. కరోనా నుండి కోలుకున్న బాధితులు ఇక నుండి ఆరోగ్య/జీవిత బీమా తీసుకోవాలంటే కష్టంతో కూడిన విషయం. కరోనా నేపధ్యంలో భారీగా క్లెయిమ్స్ వస్తుండటంతో బీమా సంస్థలు దారులు వెతుకుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 34 లక్షల మంది... ఉద్యోగాలను కోల్పియిన విషయం తెలిసిందే. 


ఇక విషయానికొస్తే...  కరోనా బారినపడి కోలుకున్న తర్వాత వెంటనే లైఫ్ ఇన్సురెన్స్ పాలసీని లేదా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలని భావిస్తే అది సాధ్యపడకపోవచ్చు. కరోనాపై గెలిచిన వారికి బీమా కంపెనీలు...  పాలసీలనిచ్చే ముందు కఠినమైన అండర్ రైటింగ్ నిబంధనలను అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో... కరోనా నుండి కోలుకున్న తర్వాత కనీసం ఆరు నెలల దాకా ఏ పాలసీ తీసుకునే అవకాశం కనిపించడం లేదు. కరోనా బారినపడి కోలుకున్న వారి దీర్ఘకాలిక ఆరోగ్యస్థితిగతులపై ఎలాంటి అంచనా లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన పాలసీలనిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మూడు నెలల తర్వాత, మరికొన్ని సంస్థలు ఆరు నెలల తర్వాత కానీ పాలసీలనివ్వడానికి ముందుకు రావట్లేదు. 


 డిశ్చార్జ్ సమ్మరీ సహా కరోనా గురించి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లనూ అందించాల్సి ఉంటుంది. బీమా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అండర్‌రైటింగ్ బృందం వచ్చి మరిన్ని వివరాలు సేకరిస్తుంది. సంబంధిత వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన రికార్డును ప్రాతిపదికన... బీమానివ్వాలా ? వద్దా ? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. ఇదే క్రమంలో... కొన్ని సందర్భాల్లో... బీమా ఇవ్వడాన్ని వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు వైద్య పరీక్షలు కూడా ఉంటాయి.. కరోనాతో పాటు వయస్సు, బీమా తీసుకునే మొత్తం, అప్పటికే ఉన్న అనారోగ్యాలు వంటి అంశాలతో కూడిన మెడికల్ టెస్టులు తప్పనిసరి. ఇక మరికొన్నిమరికొన్ని కంపెనీలు బీమా ఇచ్చేందుకు  వెనుకాడుతుండగా, ఇంకొన్ని కంపెనీలు అధిక ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి.

Updated Date - 2021-05-11T20:11:24+05:30 IST