$100 బిలియన్ క్రాష్ అయినా... అప్పటికంటే... పది రెట్లు ధనవంతుడు

ABN , First Publish Date - 2022-05-26T22:14:33+05:30 IST

గౌతమ్ అదానీ... $100 బిలియన్ల క్లబ్ నుండి క్రాష్ అయినప్పటికీ... రెండు సంవత్సరాల క్రితం కంటే ఇప్పటికీ పది రెట్లు అధికంగా ధనవంతుడు.

$100 బిలియన్ క్రాష్ అయినా...  అప్పటికంటే... పది రెట్లు ధనవంతుడు

* that is Adani

ముంబై : గౌతమ్ అదానీ... $100 బిలియన్ల క్లబ్ నుండి క్రాష్ అయినప్పటికీ... రెండు సంవత్సరాల క్రితం కంటే ఇప్పటికీ పది రెట్లు అధికంగా ధనవంతుడు. అదానీ గ్రూప్ బీసీసీఎల్ చైర్మన్/వ్యవస్థాపకుడు అన్న విషయం తెలిసిందే. అత్యంత సంపన్న భారతీయుడైన గౌతమ్ అదానీ... బిలియనీర్ల ఎలైట్ క్లబ్ నుండి క్రాష్ కావడం గమనార్హం. కేవలం నెల రోజుల క్రితం, అదానీ $125 బిలియన్ల సంపదతో ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా బిల్ గేట్స్‌తో జతకట్టారు. అయితే... ఆ తర్వాతి కాలంలో, అదానీ గ్రూపులోని ఆరు లిస్టెడ్ సంస్థలు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ₹2.17 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


గౌతమ్ అదానీ, అత్యంత సంపన్న భారతీయుడు. ఆయన గ్రూప్ కంపెనీ షేర్లు కరెక్షన్‌కు గురైన తర్వాత $100 బిలియన్ల క్లబ్ నుండి క్రాష్ అయ్యాడు. ఆయన సంపద కేవలం ఒక్కటంటే ఒక్క రోజులోనే  $7.6 బిలియన్లు క్షీణించింది. అంతేకాకుండా... అదానీకి, అంబానీకి మధ్య ఉన్న అంతరం $30 బిలియన్ల నుండి ఇప్పుడు $3 బిలియన్ల కంటే తక్కువ స్థాయికి చేరడం గమనార్హం. నెల క్రితమే... అదానీ ప్రపంచ సంపన్నుల జాబతాలో తనదైన స్థానాన్ని ఆక్రమించారు. అయినప్పటికీ, అప్పటి నుండి, ఆయన దాదాపు $27 బిలియన్ల సంపదను కోల్పోయాడు. ఇక నిన్నటి నుండి $7.6 బిలియన్ల నష్టంతో... భారీ క్షీణత ఉన్నప్పటికీ, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ ఈ సంవత్సరం $23 బిలియన్లను ఆర్జించారు. ఇది 2022 మొదటి ఐదు నెలల్లో 30% ఆరోగ్యకరమైన వృద్ధి. 


మొత్తంమీద గౌతం అదానీ ఇప్పుడు బిల్ గేట్స్ తో సరితూగగల సంపన్నుడు. అదానీ గ్రూప్ కంపెనీలల ర్యాలీ ఆయనను  ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలబెట్టింది. గౌతం అదానీ...  రెండేళ్ల క్రితం కేవలం 10 బిలియన్ డాలర్లతో పోలిస్తే... ఇప్పుడు పది రెట్లు అధికంగా ధనవంతుడు. అదానీ గ్రీన్ పునరుత్పాదక ఇంధన సంస్థ, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఐదవ వంతును కోల్పోయినప్పటికీ... గ్రూపులో అత్యంత విలువైన కంపెనీగా ఉంది.


ఈ జాబితాలో అదానీ పవర్ మాత్రమే అవుట్‌లైయర్. అంతేకాకుండా... దీని వెనుక కారణం స్పష్టంగా MSCI యొక్క గ్లోబల్ ఇండెక్స్‌లో కంపెనీని చేర్చడమేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. MSCI తన ఇండెక్స్‌లో కంపెనీని చేర్చినప్పటి నుండి, అదానీ పవర్ షేర్లు గత రెండు రోజులలో మితమైన కరెక్షన్‌ను ఎదుర్కొనే ముందు, వరుసగా ఏడు రోజుల పాటు ప్రతిరోజూ 5% అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవుతూ వచ్చాయి.

Updated Date - 2022-05-26T22:14:33+05:30 IST