Advertisement
Advertisement
Abn logo
Advertisement

తోటపల్లి నీరు విడుదల


గరుగుబిల్లి, డిసెంబరు 3: తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశారు. తోటపల్లి స్పిల్‌వే గేట్ల నుంచి సుమారు 4 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. 105 మీటర్ల నిల్వ సామర్థ్యానికిగాను.. ప్రస్తుతం 104.06 మీటర్ల నీరు నిల్వ ఉంది.  894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.  కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించి నీరు నిలుపుదల చేశారు. గేట్లు ఎత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నట్టు జేఈ శ్రీనివాసరావు తెలిపారు.


Advertisement
Advertisement