పనిచేసేవారే తప్పులూ చేస్తారు!

ABN , First Publish Date - 2021-05-15T07:27:04+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ నష్ట ని వారణ చర్యలకు ఉపక్రమించారు

పనిచేసేవారే తప్పులూ చేస్తారు!

మోదీని సమర్థిస్తూ ఖేర్‌ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, మే 14: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ నష్ట ని వారణ చర్యలకు ఉపక్రమించారు. ‘‘పనిచేసే వాళ్లే త ప్పులు కూడా చేస్తారు. ఎదుటివారిలో తప్పులెన్నేవారు తర్వాత కాలగర్భంలో కలిసిపోతారు’’ అని ఖేర్‌ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఆయన ఒక హిందీ కవితను ఉటంకించారు. సాధారణంగా ప్రధాని మోదీని, బీజేపీ సర్కారును పొగిడే అనుపమ్‌ ఖేర్‌ బుధవారం ఎన్డీటీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ... కొవిడ్‌ను ని యంత్రించడంలో కేంద్రం విఫలమయ్యిందని విమర్శించారు. ‘‘కొవిడ్‌ విషయంలో ప్రభుత్వం ఎక్కడో అదుపు తప్పింది. ఇమేజ్‌ పెంచుకోవడం కన్నా జీవితంలో ఇం కా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్న సంగతి కేంద్ర పాలకులు గుర్తించాలి. జరిగిన దానికి కేంద్రమే బాధ్యత వహించాలి’’ అని ఖేర్‌ టీవీ చర్చా కార్యక్రమం లో వ్యాఖ్యానించారు. తర్వాత ఆ వ్యాఖ్యల తీవ్రతను గ్రహించిన ఆయన మాటమార్చారు. అనుపమ్‌ ఖేర్‌ భార్య కిరణ్‌ ఖేర్‌ బీజేపీ ఎంపీ కావడంతో ఆయన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Updated Date - 2021-05-15T07:27:04+05:30 IST