‘దళితులను హత్య చేసిన వారిని శిక్షించాలి’

ABN , First Publish Date - 2022-01-29T04:50:21+05:30 IST

దళితులను దారుణంగా హత్య చేసిన వారిని శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ మాజీ జిల్లా అధికార ప్రతినిధి స్వాములు, ఎంఎంస్‌ఎఫ్‌ నాయకులు పుల్లం రాజ్‌ అంకన్న పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేశారు.

‘దళితులను హత్య చేసిన వారిని శిక్షించాలి’
పాములపాడులో రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులు

పాములపాడు జనవరి 28: దళితులను దారుణంగా హత్య చేసిన వారిని  శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ మాజీ జిల్లా అధికార ప్రతినిధి స్వాములు, ఎంఎంస్‌ఎఫ్‌ నాయకులు పుల్లం రాజ్‌ అంకన్న పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్టాడుతూ మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కామవరం గ్రామంలో భూమి వివాదంలో దళిత వర్గానికి చెందిన శివన్న, ఈరన్నలను దారుణంగా చంపిన వడ్డె చంద్ర, రాజ్‌, గోపాల్‌ మరికొంత మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుం బాలకు రూ.25 లక్షల పరిహారం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేదంటే ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మంద క్రిష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు.  కార్యక్రమంలో ఈదన్న కమలాకర్‌, సురేష్‌, రంగస్వామి, బాబు, వత్తానియేలు, పక్కిరయ్య, రవి పెద్దనాగరాజ్‌ పాల్గొన్నారు.

ఆత్మకూరు రూరల్‌: దళితులను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు దరగయ్య మాదిగ, నాగశేషులు, బుజ్జి మాదిగ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ మంత్రాలయం నియోజకవర్గం కౌతా ళం మండలం కమవరం గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన శివప్ప, ఈరన్నలను ఓ భూవివాదంలో దారుణంగా హత్య చేసిన వారి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ వివాదంలో తీవ్రంగా గాయపడిన వారికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే ఈ వివాదంలో మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

బండి ఆత్మకూరు: కౌతాళం మండలం కామవరంలో హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా నాయకులు వెంకట సుబ్బన్న, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు బాబురావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. 

Updated Date - 2022-01-29T04:50:21+05:30 IST