కరసేవకుల త్యాగాలు విస్మరించే వారు రామ ద్రోహులే: శివసేన

ABN , First Publish Date - 2020-08-05T21:54:25+05:30 IST

అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజ సమయంలో కరసేవకుల త్యాగాలను విస్మరించే వారు..

కరసేవకుల త్యాగాలు విస్మరించే వారు రామ ద్రోహులే: శివసేన

ముంబై: అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజ విషయంలో కరసేవకుల త్యాగాలను విస్మరించే వారు రామ ద్రోహులని మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన పేర్కొంది. భూమి పూజ యావద్దేశానికి, హిందువులకు చెందిన కార్యక్రమమని తెలిపింది. అయితే, మొండివైఖరి కారణంగానే ఎవరికీ క్రెడిట్ ఇవ్వలేదని పార్టీ పత్రిక 'సామ్నా' బుధవారం రాసిన సంపాదకీయంలో విమర్శించింది. వ్యక్తి, రాజకీయ పార్టీ కేంద్రంగా భూమిపూజ కార్యక్రమం సాగుతోందని అభివర్ణించింది.


'రామాలయ నిర్మాణం జరుగనున్న అయోధ్య గడ్డ కరసేవకుల త్యాగాల ఫలం. వారిని విస్మరించే వారు రామ ద్రోహులే' అని శివసేన కుండబద్ధలు కొట్టింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై చారిత్రక తీర్పు చెప్పిన మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌ను అయోధ్యలో భూమిపూజకు ఆహ్వానించకపోవడాన్ని శివసేన ప్రశ్నించింది. బాబ్రీ మసీదు కూల్చివేతలో పాత్ర కలిగిన శివసేనను కూడా ఆహ్వానించలేదని తప్పుపట్టింది. 'మోదీ హయాంలో లీగల్ అంశం పరిష్కారమై ఉండొచ్చు. లేకుంటే రంజన్ గొగోయ్‌కి పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యత్వం దక్కి ఉండకపోవచ్చు' అని సామ్నా సంపాదకీయం పేర్కొంది.

Updated Date - 2020-08-05T21:54:25+05:30 IST