ఆ రెండు బాధ్యతలు పౌరసరఫరాల శాఖవే: CM Jagan

ABN , First Publish Date - 2022-06-28T01:45:42+05:30 IST

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ-క్రాపింగ్‌, ధాన్యం కొనుగోళ్ల‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను

ఆ రెండు బాధ్యతలు  పౌరసరఫరాల శాఖవే: CM Jagan

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ-క్రాపింగ్‌, ధాన్యం కొనుగోళ్ల‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతు పండించిన పంటను ఖచ్చితంగా ఈ-క్రాపింగ్‌ చేయాలని సూచించారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు రైతును ఆదుకునేందుకు వీలవుతుందని, ఈ బాధ్యతను వీఆర్‌వో సర్వే అసిస్టెంట్‌లు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు అప్పగించాలని ఆదేశించారు.జూన్‌ 15 నుంచి ఆగస్టు 20 వ తేదీ నాటికి ఈ-క్రాపింగ్‌ పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని సాగు భూములు, రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ రిజిస్టర్‌  సర్వే అసిస్టెంట్‌లు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల వద్ద ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యత, డబ్బు చెల్లించే బాధ్యత పౌరసరఫరాల శాఖదేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-28T01:45:42+05:30 IST