ఆ రోడ్లు.. యమరద్దీ

ABN , First Publish Date - 2022-08-17T04:45:39+05:30 IST

కనిగిరి పట్టణ పరిధిలోని పలురోడ్లలో యమరద్దీ నెలకొంటోంది. నిత్యం ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. చాలాచోట్ల ఇరుకైన రోడ్లు, వాటికిరువైపులా మార్జిన్‌ వరకు ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తుండడం, దీంతోపాటు వాటి ముందే రోడ్లపై వాహనాలు నిలపడం, వీరికితోడు అక్కడక్కడా చిరువ్యాపారులు బండ్లు పెట్టుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. ఈ రోడ్లన్నీ ఎక్కడికక్కడే అనుసంధానం అయి ఉండడంతో ఏ రోడ్డులో నుంచి ఏ రోడ్డులోకెళ్లినా ట్రాఫిక్‌ నరకం చూపిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటలు దాటితే చుక్కలు కనిపిస్తున్నా యి.

ఆ రోడ్లు.. యమరద్దీ
నగరికంటి బసవయ్య సెంటర్‌ రోడ్డులో నిలిచిన ట్రాఫిక్‌


నిత్యం ట్రాఫిక్‌తో సతమతం

పలుచోట్ల ఇరుకైన రోడ్లు

వాటికిరువైపులా ముందుకొచ్చిన దుకాణాలు

ఇంకొన్నిచోట్ల మార్జిన్లు ఆక్రమించి వ్యాపారాలు

సాయంత్రం 4 దాటితే వాహనదారులకు చుక్కలే

కనిగిరి పట్టణ పరిధిలో చాలారోడ్లలో ఇదే దుస్థితి


కనిగిరి, ఆగస్టు 16 : కనిగిరి పట్టణ పరిధిలోని పలురోడ్లలో యమరద్దీ నెలకొంటోంది. నిత్యం ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. చాలాచోట్ల ఇరుకైన రోడ్లు, వాటికిరువైపులా మార్జిన్‌ వరకు ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తుండడం, దీంతోపాటు వాటి ముందే రోడ్లపై వాహనాలు నిలపడం, వీరికితోడు అక్కడక్కడా చిరువ్యాపారులు బండ్లు పెట్టుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. ఈ రోడ్లన్నీ ఎక్కడికక్కడే అనుసంధానం అయి ఉండడంతో ఏ రోడ్డులో నుంచి ఏ రోడ్డులోకెళ్లినా ట్రాఫిక్‌ నరకం చూపిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటలు దాటితే చుక్కలు కనిపిస్తున్నా యి. పట్టణంలో వ్యాపార కూడలిగా ఎంఎస్సార్‌ రోడ్డు ఉంది. ఎంఎస్సార్‌ రోడ్డు, చెప్పుల బజార్‌ రోడ్డు, గార్లపేట రోడ్డు, బొడ్డుచావిడి రోడ్లకు అనుసంధానంగా నగరికంటి బసవయ్య సెంటర్‌ ఉంటుంది. ఈ సెంటర్‌ నుం చి పట్టణ పరిధిలో ఏ వీధికైనా వెళ్లొచ్చు. అలాగే ఈ రెండేళ్లలో శ్రీనివాసమహల్‌ సెంటర్‌లో కూడా నిత్యం ట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. గత రెండేళ్లలో ఈ రోడ్లకు ఇరువైపులా వ్యాపార దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. అలాగే శ్రీనివాసమహల్‌ రోడ్డు లో సూరాపాపిరెడ్డి చౌక్‌ వరకు వివిధ వ్యాపార షాపు లు వచ్చాయి. మరో పక్క అదే రోడ్డులో మూడు ప్రైవే టు కళాశాలలు, ఆసుపత్రి, కూరగాయలు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఆ రోడ్లలో ట్రాఫిక్‌ పెరిగిపోయింది. తీగలగొంది రోడ్డులో భవననిర్మాణాలు రోడ్డు పైకి రావటంతో ఈ రోడ్డు మరింత ఇరుకుగా మారింది. ఈ రోడ్‌లో మద్యం దుకాణాలు, మంసాహార, చేపల దుకాణాలు, రెస్టారెంట్లు ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ రోడ్లులో నుంచి వాహనం వెళ్లాలంటే ఒక్కోసారి అరగంట పడుతుంది. 


ఒన్‌వే ట్రాఫిక్‌ మూడు రోజులే

గత ఏడాది రెండు నెలల పాటు తీగలగొంద, వైఎస్సార్‌ రోడ్లులో ఒన్‌వే ట్రాఫిక్‌ పెట్టిన పోలీసులు ఆ తర్వాత ఆ పద్ధతిని విస్మరించారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమైంది. 


సాయంత్రం 4 గంటల తర్వాత ట్రాఫిక్‌ నరకం

రోజూ 4 గంటలు దాటిందంటే ఆ రోడ్లులో మరింత ట్రాఫిక్‌ నిలిచిపోయి నరకం చూడాల్సి వస్తోంది. ఈ రోడ్లులో నుంచి ఆల్ఫా, ప్రగతి, కేటీఆర్‌, ఇంకా వివిధ ప్రైవేటు స్కూల్స్‌ వాహనాలు పిల్లలను ఎక్కించుకుని వస్తుంటాయి. బడి బస్సులు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


ట్రాఫిక్‌ సమస్య పరిష్కరిస్తాం

పాపారావు, సీఐ

వైఎస్సార్‌రోడ్‌, తీగలగొంది రోడ్డులో గతంలో ఒన్‌వే పెట్టాం. ప్రధానంగా ఈ మూడు సెంటర్లలో ఆక్రమణలు ఉండటంతో ఇబ్బందిగా మా రింది. అయినా సిబ్బందిని ఏర్పాటు చేసి తీగల గొంది రోడ్డులో ఒన్‌వే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నగరికంటి బసవయ్య సెంటరులో, ఎమ్మెస్సార్‌ రోడ్డులో ఉ న్న తోపుడు బండ్లు తీయించి ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తాం. సిబ్బం ది తక్కువగా ఉండటంతో, మరో పక్క వివిధ బందోబస్తులకు వెళ్లటంతో ఇబ్బందిగా మారింది. త్వరలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూస్తా.

Updated Date - 2022-08-17T04:45:39+05:30 IST