జీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!

ABN , First Publish Date - 2021-12-22T23:12:49+05:30 IST

ఆ తొమ్మిది ప్రశ్నలు అతడి జీవితాన్నే మార్చేశాయి. ఏకంగా రూ.కోటి ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం కొట్టేశాడు. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, లండన్ కార్యాలయంలో రాజస్థాన్ జుంజునుకు చెందిన సౌరభ్ కుల్హారీ..

జీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!

ఆ తొమ్మిది ప్రశ్నలు అతడి జీవితాన్నే మార్చేశాయి. ఏకంగా రూ.కోటి ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం కొట్టేశాడు. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, లండన్ కార్యాలయంలో రాజస్థాన్ జుంజునుకు చెందిన సౌరభ్ కుల్హారీ.. రూ.1.06 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకోనున్నాడు. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారని సౌరభ్ తెలిపాడు. చిన్నతనం నుంచి ఉద్యోగం పొందేవారకు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదర్కొన్నట్లు చెప్పాడు. అమెజాన్‌ ఇంటర్వ్యూకు ముందు డెంగీ వచ్చిందని, అయినా ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు తెలిపాడు. సౌరభ్ ఇంటర్వ్యూ మూడు గంటల పాటు సాగింది. రెండు రౌండ్లలో కంపెనీ మేనేజ్‌మెంట్ ఒకే రకమైన 6 ప్రశ్నలను అడిగారు. దీంతో రెండింటిలోనూ ఆయన ఒకే సమాధానం ఇచ్చాడు. రెండో రౌండ్‌లో కోడింగ్‌కు సంబంధించి మూడు ప్రశ్నలు అడిగారు. సౌరభ్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం వచ్చే ఏడాది అమెజాన్ కంపెనీలో చేరనున్నాడు.


రెండు రౌండ్లలో అమెజాన్ వారు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి..


ప్రశ్న: మీ పరిధిలోకి రాకున్నా.. బాధ్యత తీసుకుని పూర్తి చేసిన పని ఏమైనా ఉందా?

సమాధానం: నా ఇంటర్న్‌షిప్ సమయంలో, ఫైల్ ఫార్మాట్ ఫీచర్‌ను విశ్లేషించమని అడిగారు. అయితే కేవలం ఫీచర్‌ వరకే నా పరిధి అయినా.. బాధ్యతగా తీసుకుని పూర్తి చేశారు. దీంతో కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ తదితరులు నన్ను అభినందించారు. 


ప్రశ్న: మీతోటి స్నేహితులకు చదవు, ఇతర విషయాల్లో సాయం చేసిన సందర్భాలు ఉన్నాయా?

సమాధానం: నేను ఐఐటీ అంటే అవగాహన లేని ప్రాంతం నుంచి వచ్చాను. తర్వాత ఐఐటీ పరీక్షలకు నాలాంటి చాలా మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాను. అంతే కాకుండా కళాశాలలో కూడా పలువురికి సాయం అందించాను.


ప్రశ్న : దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఏదైనా కోల్పోవాల్సి వచ్చిందా.. ఉంటే ఒక ఉదాహరణ చెప్పండి?

సమాధానం: అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.


ప్రశ్న: మీరు కొత్త టెక్నాలజీపై పనిచేసిన సమయంలో అందులోని సూక్ష్మ నైపుణ్యాలను ఎలా అర్థం చేసుకున్నారు?

సమాధానం: ఇంటర్న్‌షిప్ సమయంలో, నేను అలాంటి ప్రాజెక్ట్‌లో పని చేశాను. అయితే దాని గురించి చాలా నాకు చాలా పెద్దగా తెలీదు. దీంతో సీనియర్, ఇతర ఇంజనీర్ల సహకారంతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను.


ప్రశ్న: మీరు కష్టమైన ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసిన సందర్భం ఉంటే చెప్పండి?

జవాబు: మూడో ఏడాది చివరి సెమిస్టర్‌లో కంపైలర్ సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ చేశాను. మొత్తం నలుగురు విద్యార్థుల బృందానికి నాయకత్వం వహించాను. అయితే కరోనా కారణంగా ఏప్రిల్‌లో సహచరుల కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి తక్కువ సమయం ఉంది. దీంతో ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు చేసి, 10 రోజుల కంటే తక్కువ వ్యవధిలోపూర్తి చేశాను. పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ను మే 14న సమర్పించాను.


ప్రశ్న: మీరు గడువు చాలా తక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేశారు ?

సమాధానం: బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రాజెక్ట్‌లో పని చేసే సమయంలో సమయం తక్కువగా ఉండేది. హార్డ్ ప్రాజెక్ట్‌లో చాలా మార్పులు చేయడం ద్వారా సులభతరమైంది. తద్వారా ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయగలిగాను.


ఈ ఆరు ప్రశ్నలతో పాటూ రెండో రౌండ్‌లో కోడింగ్‌కు సంబంధించి మూడు ప్రశ్నలు అడిగారు. సౌరభ్ ల్యాప్‌టాప్ సాయంతో మూడు ప్రశ్నలను ఒకటిన్నర గంటలో పరిష్కరించాడు. దీంతో అమెజాన్ మేనేజ్‌మెంట్ బృందం సంతృప్తిచెంది ఉద్యోగంలోకి తీసుకుంది. వచ్చే ఏడాది లండన్‌లో విధుల్లో చేరనున్నట్లు సౌరభ్ తెలిపాడు.


Updated Date - 2021-12-22T23:12:49+05:30 IST