ఆ ఫీజులు.. ఇక అంతేనా?

ABN , First Publish Date - 2022-09-23T20:58:26+05:30 IST

జగనన్న విద్యా దీవెన(Educational blessing) కింద రూ.వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం... కొవిడ్‌ పేరుతో 2020-21 విద్యా సంవత్సరం చివరి క్వార్టర్‌ ఫీజులను ఇప్పటికీ విడుదల చేయలేదు. కరోనా కారణంగా తరగతులు జరగనందున ఆ ఫీజులు

ఆ ఫీజులు.. ఇక అంతేనా?

జగనన్న విద్యా దీవెన(Educational blessing) కింద రూ.వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం... కొవిడ్‌ పేరుతో 2020-21 విద్యా సంవత్సరం చివరి క్వార్టర్‌ ఫీజులను ఇప్పటికీ విడుదల చేయలేదు. కరోనా కారణంగా తరగతులు జరగనందున ఆ ఫీజులు కట్టాల్సిన పనిలేదని చెబుతోంది. దీంతో ఇంజనీరింగ్‌, డిగ్రీ, ఫార్మా కోర్సుల విద్యార్థులకు ఆ త్రైమాసికానికి సంబంధించిన రూ.700కోట్ల ఫీజు బకాయిలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. విద్యార్థులు ఫీజు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చేయాలని ఆదేశాలు ఇవ్వకపోవడంతో డబ్బు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాలలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇస్తుందన్న ఆశ లేకపోవడంతో కొందరు సొంతగానే ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. అయినా అధికార పార్టీ మాత్రం క్వార్టర్‌ ముగిసిన వెంటనే ఫీజులు ఖాతాల్లో వేస్తున్నామంటూ సోషల్‌ మీడియాలో డప్పు కొట్టుకుంటోంది. 

Updated Date - 2022-09-23T20:58:26+05:30 IST