ఆ ఖర్చులు తండ్రి భరించాల్సిందే

ABN , First Publish Date - 2021-10-18T16:33:57+05:30 IST

కుమారుడికి..

ఆ ఖర్చులు తండ్రి భరించాల్సిందే

పిల్లలకు 18 ఏళ్లు నిండగానే బాధ్యతలు తీరిపోవు: కోర్టు


న్యూఢిల్లీ: కుమారుడికి 18ఏళ్లు నిండినంత మాత్రాన అతని విషయంలో తండ్రి బాధ్యతలు తీరిపోవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కొడుక్కి మెజారిటీ తీరిందని అతని విద్య, తదితరాల కోసం చేయాల్సిన ఖర్చుల నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది. కొడుక్కి18ఏళ్లు నిండాయన్న కారణంతో అతడి చదువుకయ్యే మొత్తం ఖర్చుల భారం తల్లిపై వేయకూడని న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ స్పష్టం చేశారు. పిల్లల కోసం తన సంపాదన మొత్తం వ్యయం చేసిన భార్యకూ ఆమెభర్త పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొడుకు గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యే వరకూ లేదా సంపాదన ప్రారంభించే వరకూ తన నుంచి విడిపోయిన భార్యకు నెలకు రూ.15వేల మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.   

Updated Date - 2021-10-18T16:33:57+05:30 IST