Thoothukudi District: ఆదిత్యనల్లూర్‌లో మట్టిపాత్రలు లభ్యం

ABN , First Publish Date - 2022-08-14T15:09:34+05:30 IST

తూత్తుకుడి జిల్లా(Thoothukudi District) ఆదిత్యనల్లూర్‌లో చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా రెండు మూతలతో కూడిన మట్టిపాత్రలు బయల్పడ్డాయి. కేంద్ర

Thoothukudi District: ఆదిత్యనల్లూర్‌లో మట్టిపాత్రలు లభ్యం

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 13: తూత్తుకుడి జిల్లా(Thoothukudi District) ఆదిత్యనల్లూర్‌లో చేపట్టిన తవ్వకాల్లో తొలిసారిగా రెండు మూతలతో కూడిన మట్టిపాత్రలు బయల్పడ్డాయి. కేంద్ర పురావస్తు శాఖ మండల డైరెక్టర్‌ అరుణ్‌రాజ్‌ బృందం ఆదిత్యనల్లూర్‌ పరుంబు, పాండ్యరాజా ఆలయ సమీపం, కాల్వాయ్‌ రోడ్డు, పులియాంకుళం రోడ్డు ప్రాంతాల్లో తవ్వకాలు(Excavations) చేపట్టగా ఇనుప ఆయుధాలు, బంగారు చెవిదుద్దులు, మట్టి పాత్రలు లభించాయి. రెండు మూతలతో  కూడిన మట్టి పాత్రలో ప్రాచీన మానవుల అస్తికలు లభించాయి. వాటిని పరిశోధించిన అనంతరమే అవి ఏ కాలానికి చెందినవని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-14T15:09:34+05:30 IST