రేపు ఢిల్లీలో పోలవరం నిర్వాసితుల నిరసన

ABN , First Publish Date - 2021-08-04T06:45:06+05:30 IST

పోలవరం నిర్వాసితుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరింది. ఈనెల 5న జంతర్‌మంతర్‌ వద్ద వీరంతా నిరసన వ్యక్తం చేయనున్నారు.

రేపు ఢిల్లీలో  పోలవరం నిర్వాసితుల నిరసన
వంతల రాజేశ్వరి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లిన గిరిజన నేతలు

అఖిలపక్షం మద్దతు 8 రైల్వే స్టేషన్లలో అడ్డుకున్న పోలీసులు

ఢిల్లీ చేరిన నిర్వాసితులు, నేతలు

 రాజమహేంద్రవరం (ఆంద్రజ్యోతి), ఆగస్టు3: పోలవరం నిర్వాసితుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరింది. ఈనెల 5న జంతర్‌మంతర్‌ వద్ద వీరంతా నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ బృందానికి అఖిలపక్ష నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాలని డిమాండ్‌తో ఈ ఆందోళన నిర్వహిస్తారు. సోమవారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ నుంచి వీరంతా బయలుదేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల బాధపడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు, ఇటీవల కాఫర్‌ డ్యామ్‌ వల్ల పెరిగిన ముంపు, పునరావాసం పూర్తిగా కల్పించకుండానే గ్రామాలు ఖాళీ చేయిస్తున్న వైనం గురించి  నిరసనలో నిలదీయనున్నాను. అలాగే నిర్వాసిత ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ఇటీవల అఖిలపక్ష నేతలు తిరిగి సేకరించిన వివరాలు, కాలనీల్లో అసౌకర్యాలకు సంబంధించి తీసిన వీడియోలు, ఫోటోలు అక్కడ ప్రదర్శించనున్నారు. 97 గ్రామాలకు చెందిన 25 వేల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని, మిగతా వారందరికీ పూర్తి పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు కట్టాలనే డిమాండ్‌ కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లిన నిర్వాసితులు మంగళవారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌ దిగి సమీపంలో ఒక పార్కు వద్దకు చేరుకోగా, అక్కడ పోలీసులు అడ్డగించినట్టు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. తెలుగుదేశం నేతలు జ్యోతుల నెహ్రూ, గల్లా జయదేవ్‌, సీపీఐ నేతలు కె.రామకృష్ణ, కె.నారాయణ తదితరులు పోలీసులతో వాదన చేసి తాము ఎందుకొచ్చామో వివరించడంతో పోలీసులు అడ్డుతొలగినట్టు వారు తెలిపారు. జిల్లా నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు తరలివెళ్లగా దేవీపట్నం మండల పార్టీ అఽధ్యక్షుడు మాగటి బాబూరావు, బీసీ సెల్‌ నేతలు నగేష్‌, చింతూరు నాయకులు ఎండి రియాజ్‌ కూనవరం జడ్పీటీసీ అభ్యర్థి సోడి ధనలక్ష్మి, తదితరులు వారిలో ఉన్నారు. రాఖీని అభినందిస్తున్న సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుడు రంబాల, భీమశంకర్‌


Updated Date - 2021-08-04T06:45:06+05:30 IST