రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం : తోమర్

ABN , First Publish Date - 2020-09-20T15:44:01+05:30 IST

వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం : తోమర్

న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులను కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతుల జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని ఆయన ప్రకటించారు. రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకునే సౌకర్యం ఈ బిల్లు కల్పిస్తోందన్నారు. కనీస మద్దతు ధరకు, ఈ బిల్లులకు ఎలాంటి సంబంధమూ లేదని, ఈ విషయాన్ని రైతు లోకం గమనంలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ... 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారలేదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో దేశంలోని రైతుల జీవన సరళే మారిపోతుందని భూపేంద్ర యాదవ్ తెలిపారు. అయితే కేంద్రం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. తాము ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని ప్రతాప్ సింహ బాజ్వా స్పష్టం చేశారు. తమ జీవితాలపై దాడి చేయడానికే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని పంజాబ్, హర్యానా రైతులు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదించడమంటే రైతుల డెత్ వారెంట్ పై సంతకం చేయడం లాంటిందని బజ్వా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-09-20T15:44:01+05:30 IST