ఈ‘సారీ... అవే వడ్డీ రేట్లు...

ABN , First Publish Date - 2020-09-28T03:35:34+05:30 IST

ప్రస్తుతమున్న వడ్డీ రేట్లే... ఈ సారీ కొనసాగనున్నాయా ? ఈ ప్రశ్నకు సంబంధిత వర్గాల నుంచి ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)... ఇప్పుడున్న వడ్డీ రేట్లనే మళ్ళీ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో అమలుకానున్న ‘ద్రవ్య పరపతి విధానం’లో ప్రస్తుతమున్న వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని వినవస్తోంది.

ఈ‘సారీ... అవే వడ్డీ రేట్లు...

ముంబై : ప్రస్తుతమున్న వడ్డీ రేట్లే... ఈ సారీ కొనసాగనున్నాయా ? ఈ ప్రశ్నకు సంబంధిత వర్గాల నుంచి ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)... ఇప్పుడున్న వడ్డీ రేట్లనే మళ్ళీ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో అమలుకానున్న ‘ద్రవ్య పరపతి విధానం’లో ప్రస్తుతమున్న వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని వినవస్తోంది.


కాగా... ద్రవ్యోల్భణం అధికంగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)... ఈ నెల 29 నుంచి  మూడు రోజులపాటు సమావేశమై... అక్టోబర్ ఒకటిన  తన నిర్ణయాలను వెలువరించనుంది. 


కాగా... కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి నుండి వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్భణం అదుపే లక్ష్యంగా... కిందటిసారి వడ్డీ రేట్లను తగ్గించని విషయం తెలిసిందే. వడ్డీ రేట్లను ఈ దఫా కూడా అలాగే ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చే పరిస్థితి చోటుచేసుకునేవరకు ఎలాంటి కోతలూ చోటుచేసుకోకపోవచ్చని చెబుతున్నారు.


గతేడాది ఆర్థిక మందగమనం, ఈసారి కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ దఫా... అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలో... ఫిబ్రవరి నుండి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది కూడా. కాగా వడ్డీ రేట్లను ఈ దఫా తగ్గించనిపక్షంలో... ఆర్ధిక మందగమనా మరింత తీవ్రంగా ఉంటుందని బ్యాంకింగ్, వాణిజ్యవర్గాలు పేర్కొంటున్నాయి. 


Updated Date - 2020-09-28T03:35:34+05:30 IST