ఈ వారం వివిధా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-02-24T07:09:32+05:30 IST

ధనికొండ కథలపై చర్చా సమావేశం పుస్తకావిష్కరణ ‘దక్షిణాయనం’ కవితా సంపుటి విరసం సదస్సు కొలకలూరి పురస్కారాలు 2020 మధునాపంతుల శతజయంతి సదస్సు ‘మాలపల్లె కథలు’ ‘ఆదిధ్వని’ గిరిజన జానపద సంగీత ఉత్సవాలు...

ఈ వారం వివిధా కార్యక్రమాలు

ధనికొండ కథలపై చర్చా సమావేశం

ధనికొండ  హనుమంతరావు శతజయంతి ముగింపు సమావేశాల్లో భాగంగా ఆయన కథలమీద  మార్చి 1 ఉ.10గం.లనుంచి సా.5గం.లదాక రవీంద్రభారతి మినీ హాల్‌లో చర్చా సమావేశం జరుగుతుంది. ఇందులో ఆయన రచనా కాలపు నేపథ్యం గురించి వకుళా భరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, కె. శ్రీనివాస్‌, ఆయన కథల గురించి కాత్యాయని విద్మహే, నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ మాట్లాడతారు. ఎంపిక చేసిన 40కథల మీద 25మందికి పైగా యువ రచయి తలు, విమర్శకులు, సాహిత్య అభిమానులు చర్చిస్తారు.

ధనికొండ శతజయంతి సంఘం


పుస్తకావిష్కరణ

కనప నరేందర్‌ రాసిన పలుపుస్తకాల ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 24 ఉ.10.30కు నిజాం కళాశాల ఆడిటో రియం, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, సి.హెచ్‌. గోపాలరెడ్డి, ఎల్‌.బి. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొంటారు. 

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ


‘దక్షిణాయనం’ కవితా సంపుటి
ఎస్‌.చల్లప్ప ‘దక్షిణాయనం’ కవితా సంపుటి, కూటికు ప్పల సూర్యారావు రచనకు తమిళ అనువాదం ‘సూర్య కిరనంగల్‌’ పుస్తకాల ఆవిష్కరణ ఫిబ్రవరి 24 సా.6 గం.లకు విశాఖపౌర గ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది.  
నవసాహితీ

విరసం సదస్సు
కాశీం, వరవరరావు, సాయిబాబా అరెస్టు, వారి కవిత్వం అనే అంశంపై మార్చి 1 మ.2గం.ల నుంచి రా.9గం.ల వరకు హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో విరసం సదస్సు జరుగుతుంది. శిఖామణి, యాకూబ్‌, ఊసా, సూరేపల్లి సుజాత, ఎన్‌.వేణుగో పాల్‌, మెర్సీ మార్గరెట్‌, రివేరా పాల్గొంటారు.
విరసం

కొలకలూరి పురస్కారాలు 2020
కొలకలూరి పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఫిబ్ర వరి 26 సా.6గం.లకు యన్‌.టి.ఆర్‌. కళా ప్రాంగణం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పుర స్కారాన్ని చింతకింది శ్రీనివాసరావు (‘బుగతలనాటి చుక్కపల్లి’), కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కా రాన్ని యం.వి.రామిరెడ్డి (‘వెంటవచ్చునది’) స్వీకరిస్తారు.
కొలకలూరి అనితా శ్రీకిరణ్‌

మధునాపంతుల శతజయంతి సదస్సు
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సదస్సు వారి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని యానం సమీపగ్రామం పల్లిపాలెంలో జరుగుతుంది. కార్యక్రమంలో కె. శివారెడ్డి, మండలి బుద్ధ ప్రసాద్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, శిఖామణి, అప్పాజోస్యుల, సన్నిధానం, రెంటాల తదితరులు పాల్గొంటారు. 
ఎం.వీ. చలపతి

‘మాలపల్లె కథలు’ 
భూతం ముత్యాలు ‘మాలపల్లె  కథలు’ పుస్తకావి ష్కరణ సభ మార్చి 7 మ.2గం.లకు ఐసిఎస్‌ఎస్‌ఆర్‌ గెస్ట్‌ హౌజ్‌, ఉస్మానియా యూనివర్శిటీ, హైదరా బాద్‌లో జరుగుతుంది. జి.వి. రత్నాకర్‌, మంచాల లింగస్వామి, ఏనుగు నర్సింహారెడ్డి, జూపుడి ప్రభాకర్‌ రావు, సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు.
ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌

‘ఆదిధ్వని’ గిరిజన జానపద సంగీత ఉత్సవాలు
అపురూపమైన, అంతరించిపోతున్న గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన, సంగీత ఉత్సవాలు కార్య క్రమం ‘ఆదిధ్వని’ ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు ప్రతి సా.6.30నుంచి  శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్న మయ్యవీధి, 5వలైను, బృందావన్‌గార్డెన్స్‌, గుంటూరు లో జరుగుతుంది. 

నన్నపనేని అయ్యన్‌ రావు

Updated Date - 2020-02-24T07:09:32+05:30 IST