ఈ వారమే అత్యంత కీలకం

ABN , First Publish Date - 2020-04-08T12:12:19+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈవారం రోజులు అత్యంత కీలకం.. ప్రజలు స్వీయనిర్బంధంలోనే

ఈ వారమే అత్యంత కీలకం

భౌతిక దూరమే శ్రీరామరక్ష 

వలస కార్మికులు, నిరాశ్రయుల కోసం 34 పునరావాస కేంద్రాలు

మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స 

కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష


విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్‌7: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈవారం రోజులు అత్యంత కీలకం.. ప్రజలు స్వీయనిర్బంధంలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసర సరుకులు, కూరగాయలకు కొరత లేకుండా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఏడు రైతుబజార్లతో పాటు మరో ఇరవై వరకూ విక్రయ కేంద్రాలు,  మొబైల్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.


జిల్లాలో 6,32,500 క్వింటాళ్ల బియ్యం తెలుపు రేషన్‌కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేశామని, వెయ్యి రూపాయలు ఆర్థికసాయం కూడా అందించామన్నారు. ఈనెల 15న మరోసారి రేషన్‌ పంపినీ చేస్తామని చెప్పారు.  లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాలో ఇరుక్కుపోయిన 3500 మంది వలస కూలీలు, నిరాశ్రయుల కోసం 34 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన, వసతి సదు పాయం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కరోనా వ్యాప్తి నివా రణకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 


భౌతిక దూరంతోనే కరోనా నివారణ

కరోనా వైరస్‌ నివారించాలంటే భౌతిక దూరం పాటించాలని మంత్రి బొత్స తెలిపారు. లాక్‌డౌన్‌ ఈ వారం రోజులు పాటు మరింత కఠినం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. గ్రామ, వార్డు వలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలన్నారు. పారిశుధ్య పనులకు సంబంధించి అవసరమైతే అద నంగా పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని సూచించారు. స్వచ్ఛం ద సేవల సహకారాన్ని తీసుకోవాలన్నారు. కేంద్రాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తక్షణం జీతం చెల్లించాలని సంబంధిత అధికా రులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్న వారికి వైద్యసేవలు అందించేందుకు కొన్ని ఆసుపత్రులు ముందుకు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై తగు చర్యలు చేపట్టా లని కలెక్టర్‌ను ఆదేశించారు. 


ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించండి

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు గాను విదేశాలు, ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారి వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని మంత్రి బొత్స అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఒక్క కేసు కూడా లేకపోవడం ఆనందంగా ఉందన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచి జిల్లాకు ఎవ రూ రాకుండా  సరిహద్దుల్లో చెక్‌ పోస్టు లు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజ కుమారిని ఆదేశించారు. 


4500 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు

జిల్లాలో 4500 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని బొత్స తెలి పారు. ఇప్పటి వరకూ 341 మందికి క్వారంటైన్‌లో వైద్యసేవలు అంది స్తున్నామన్నారు. వైద్యసేవలు అంది స్తున్న వైద్యులు, సిబ్బందికి పూర్తి స్థాయి లో వ్యక్తిగత రక్షణ పరికరాలు కల్పించా మని తెలిపారు. స్వీయనిర్బంధంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.  లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయట తిరగకుండా చూడాలన్నారు. సమావేశం లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పోలీసు,  రెవెన్యూ, వైద్యాధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-08T12:12:19+05:30 IST