మరింత దిద్దుబాటు!

ABN , First Publish Date - 2021-03-01T06:35:02+05:30 IST

ఈ వారం కరెక్షన్‌ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెక్షన్‌ ట్రెండ్‌లో సాగితే నిఫ్టీ 14200-14000 దిశగా సాగే వీలుంది. అయితే కీలక మద్దతు స్థాయిలు 14000 వద్ద ఉంటాయి...

మరింత దిద్దుబాటు!

ఈ వారం కరెక్షన్‌ కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరెక్షన్‌ ట్రెండ్‌లో సాగితే నిఫ్టీ 14200-14000 దిశగా సాగే వీలుంది. అయితే కీలక మద్దతు స్థాయిలు 14000 వద్ద ఉంటాయి. ఒకవేళ ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే 13700- 13500 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయి. సుదీర్ఘ కాలంగా మార్కెట్లో ప్రదానంగా ఎలాంటి కరెక్షన్‌ కనిపించలేదు. దీంతో లాభాల స్వీకరణ లేదా స్వల్పకాలిక దిద్దుబాటు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ట్రేడర్లు కొంతకాలం పాటు దూకుడుగా వ్యవహరించకుండా ఉండటం మంచిది.  


స్టాక్‌ రికమండేషన్స్‌

ఎన్‌టీపీసీ: డైలీ, వీక్లీ చార్టులను పరిశీలిస్తే కొద్ది నెలలుగా ఈ షేరులో ‘అక్యుములేషన్‌ ప్యాట్రన్‌’ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.107.35 వద్ద క్లోజైన ఈ షేరు.. రూ.103-100 స్థాయిలకు పడిపోతే రూ.118 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.94.50 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బజాజ్‌ ఫైనాన్స్‌: గత కొద్ది వారాలుగా ఈ షేరు పడుతూ వస్తోంది. గత శుక్రవారం 5 శాతం పతనమై రూ.5,243.55 వద్ద క్లోజైంది. ఒకవేళ ఈ షేరు రూ.5,320 దిశగా సాగితే రానున్న రోజుల్లో రూ.5,080 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించటం మంచిది. అయితే రూ.5,460 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐసీఐసీఐ బ్యాంక్‌: ఇతర ఫైనాన్షియల్‌ షేర్ల తరహాలోనే ఈ షేరు సాగుతోంది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే 1-2-3 ప్యాట్రన్‌తో బేరిష్‌ ధోరణిని సూచిస్తోంది. గత శుక్రవారం రూ.597.25 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న రోజుల్లో రూ.564 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించవచ్చు. అయితే రూ.615.60 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట, టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌



నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2021-03-01T06:35:02+05:30 IST