ఈ వాల్ పేపర్ పెట్టుకుంటే.. ఫోన్లు క్రాష్ అవుతున్నాయట!

ABN , First Publish Date - 2020-06-02T02:47:28+05:30 IST

మన మొబైల్‌ అందంగా కనిపించడం కోసం రకరకాల వాల్‌పేపర్లు మారుస్తుంటాం.

ఈ వాల్ పేపర్ పెట్టుకుంటే.. ఫోన్లు క్రాష్ అవుతున్నాయట!

ఇంటర్నెట్ డెస్క్: మన మొబైల్‌ అందంగా కనిపించడం కోసం రకరకాల వాల్‌పేపర్లు మారుస్తుంటాం. అలాంటి ఓ వాల్‌పేపర్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు క్రాష్ అయిపోతున్నాయట. దీనిపై చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారట. ఈ ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే.. తమ మొబైల్స్ స్క్రీన్‌లాక్ దానంతటదే ఆన్ అవడం, వెంటనే ఆఫ్ అవడం జరుగుతోందని వినియోగదారులు చెప్తున్నారు. దీనిపై ఓ నిపుణుడు మాట్లాడుతూ.. సదరు ఫొటో ఆర్‌జీబీ(RGB) కలర్ ఫార్మాట్‌లో ఉందని, ఆండ్రాయిడ్ ప్రఫర్డ్ ఎస్‌ఆర్‌జీ‌బీ(sRGB)లో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుండొచ్చని చెప్పారు. ఏదిఏమైనా ఈ ఒక్క ఫొటో చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లకు తలనొప్పులు తెచ్చిందనడం మాత్రం నిజం. మీరు ఇలాంటి ఫొటోలు వాల్‌పేపర్లుగా వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Updated Date - 2020-06-02T02:47:28+05:30 IST