ఈ చెట్టుకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు...

ABN , First Publish Date - 2020-07-12T19:29:00+05:30 IST

ఆ చెట్టు ఇప్పటిదీ, అప్పటిదీ కాదు... ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పేరు... ‘పిల్లలమర్రి’. మహబూబ్ నగర్ పట్టణం సమీపంలో మూడున్నర ఎకరాల్లో ఈ చెట్టు విస్తరించి ఉంది. దేశంలోని మూడవ అతి పెద్ద మర్రిమానుగా ఈ చెట్టుకు పేరుంది. మరి అటువంటి మహా వృక్షానికి ఇప్పుడు చెదలు పడుతున్నాయి. అంతేకాదు... ఫంగస్‌తో మూలలు ఎక్కడికక్కడే ఎండిపోయి కిందకు వాలి, రాలిపోతున్నాయి.

ఈ చెట్టుకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు...

మహబూబ్‌నగర్ : ఆ చెట్టు ఇప్పటిదీ, అప్పటిదీ కాదు... ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పేరు... ‘పిల్లలమర్రి’. మహబూబ్ నగర్ పట్టణం సమీపంలో మూడున్నర ఎకరాల్లో ఈ చెట్టు విస్తరించి ఉంది. దేశంలోని మూడవ అతి పెద్ద మర్రిమానుగా ఈ చెట్టుకు పేరుంది. మరి అటువంటి మహా వృక్షానికి ఇప్పుడు చెదలు పడుతున్నాయి. అంతేకాదు... ఫంగస్‌తో మూలలు ఎక్కడికక్కడే ఎండిపోయి కిందకు వాలి, రాలిపోతున్నాయి.


మరోవైపు కోమ్మలు కూడా విరిగిపోతూ నేలపాలవుతున్నాయి. ఈ క్రమంలో... పిల్లలమర్రి ఎక్కడ నేలమట్టమవుతుందోనని అధికారులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో... మనోరంజన్ భాంజా అనే ఓ నిపుణుడి సూచనలతో... పిల్లల మర్రి చెట్టుకు అధికారులు మళ్ళీ ప్రాణం పోసారు. చెట్టు మొదళ్ళలో చెదలు. ఫంగస్‌ను పూర్తిగా తొలగించే ప్రయత్నంలో భాగంగా ‘క్లోరో ఫైర్ఫాక్స్’ స్ప్రేను ఉపయోగించారు.


అలాగే కొమ్మలకు నాలుగు అంగుళాల మేర రంధ్రాలు చేసి క్లోరిపైరిఫాస్‌ సెలైన్ ఎక్కించారు. విరిగిపోయిన పెద్దపెద్ద కొమ్మలకు కూడా సిమెంట్ దిమ్మల ద్వారా సపోర్ట్ అందించారు. ఇలా దాదాపు సంవత్సరం పాటు ప్రయత్నం చేయగా ప్రస్తుతం పంచ గవ్య క్యూబిక్ యాసిడ్ పిచికారి చేస్తూ పిల్లలమర్రిని అక్కడి అధికారులు సంరక్షించుకుంటూ వచ్చారు.దీనితో పిల్లలమర్రి పచ్చని ఆకులతో మళ్లీ కనిపిస్తోంది.

Updated Date - 2020-07-12T19:29:00+05:30 IST