ఈసారి వృద్ధి మైనస్‌ 9%: ఏడీబీ

ABN , First Publish Date - 2020-09-16T06:17:43+05:30 IST

కరోనా దెబ్బకు కుదేలైన భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో -9 శాతానికి క్షీణించవచ్చని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (

ఈసారి వృద్ధి మైనస్‌ 9%: ఏడీబీ

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు కుదేలైన భారత్‌ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో -9 శాతానికి క్షీణించవచ్చని ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. జూన్‌లో అంచనా వేసిన -4 శాతం వృద్ధి క్షీణతతో పోలిస్తే ఇది చాలా అధికం. గడిచిన నాలుగు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా వృద్ధి పతనాన్ని చవిచూడనుందని ఏడీబీ తాజా నివేదికలో పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మాత్రం వృద్ధి రేటు ఏకంగా 8 శాతానికి ఎగబాకనుందని భావిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాని (ఏప్రిల్‌-జూన్‌)కి జీడీపీ వృద్ధి -23.9 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. దాంతో దేశీయ, అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు, ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇప్పటికే వృద్ధి అంచనాలను సవరించాయి. 

Updated Date - 2020-09-16T06:17:43+05:30 IST