మా అబ్బాయికి పుట్టుకతోనే గుండె సమస్య.. సర్జరీతో సరిచేయొచ్చు.. సాయం చేసి కాపాడండి

ABN , First Publish Date - 2022-02-10T17:17:02+05:30 IST

మా జీవితాల్లోకి మా అబ్బాయి అడుగుపెట్టినప్పుడు మేం ఎంతో ఆనందపడ్డాం. ఆ చిన్నారి....

మా అబ్బాయికి పుట్టుకతోనే గుండె సమస్య.. సర్జరీతో సరిచేయొచ్చు.. సాయం చేసి కాపాడండి

మా జీవితాల్లోకి మా అబ్బాయి అడుగుపెట్టినప్పుడు మేం ఎంతో ఆనందపడ్డాం. ఆ చిన్నారి బోసినవ్వులు తప్ప మా జీవితాల్లో ఇంకేదీ వద్దని నేను, నా భర్త కోరుకున్నాం.


మా ఇంట పసిపాప నవ్వులు చిందించాలని 20 ఏళ్ళుగా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆ పూజలు ఫలించి మేం అమ్మానాన్న అయినప్పుడు ఎంతో సంతోషపడ్డామో చెప్పలేం. కానీ, ఆ ఆనందాన్ని మేం ఎంతో కాలం అనుభవించలేదు.


మా అబ్బాయి పుట్టిన వెంటనే వాడు దగ్గు, జలుబుతో బాధపడుతూ ఊపిరి తీసుకోవడంలో ఎంతో కష్టపడేవాడు. క్రమంగా వాడి శరీరం నీలం రంగులోకి మారడం మొదలైంది. దాంతో మేం ఎంతో కంగారు పడి మా అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్ళాం.


డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసిన తర్వాత మమ్మల్ని పిలిచారు. అక్కడ మమ్మల్ని ఎంతో బాధపెట్టే విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది.


"మీ అబ్బాయి పుట్టుకతోనే interventricular septumతో కూడిన గుండె సమస్యలతో బాధపడుతున్నాడు... ఆ సమస్యను సరి చెయ్యవచ్చు కానీ, అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి. అందుకు సుమారుగా  రూ. 10 లక్షలు (13,337.25 డాలర్లు) ఖర్చవుతుంది" అని డాక్టర్లు చెప్పారు.


ఆ మాటలు వింటూనే మా ప్రపంచమంతా కంపించి, తల్లకిందులైపోయింది.



సాయం చేయడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి




మేము తమిళనాడులోని కాంచీపురం ప్రాంతానికి చెందినవాళ్లం. మా కుటుంబంలో నా భర్త మాత్రమే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ చాలీచాలని సంపాదన తెస్తాడు. కానీ, ఈ కోవిడ్ పరిస్థితుల తర్వాత ఆ కాస్త డబ్బు సంపాదించడం కూడా చాలా కష్టంగా మారింది.


మా అబ్బాయి కోసం IVF చేయించుకున్నప్పుడు ఎంతో డబ్బు ఖర్చు చేశాం. నా నగలు తాకట్టు పెట్టి, ఎక్కువ వడ్డీకి అప్పు చెయ్యాల్సి వచ్చింది. మాకున్నదంతా దాదాపు అయిపోవచ్చింది.


ముద్దుల మూట మా అబ్బాయి అలా బాధపడుతుంటే నాకు ఏడుపు ఆగడం లేదు. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకును కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను.


మా జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలోనైనా అనుకోలేదు. మా ఒక్కగానొక్క పిల్లాడు కష్టపడుతుంటే, వాడిని రక్షించుకోవడానికి మా దగ్గరేమీ లేని దుస్థితిలో ఉన్నాం.


మా అబ్బాయికి ఏం జరిగినా తట్టుకోలేం....ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించేది మీరు మాత్రమే. దయచేసి సాయం చెయ్యండి.


ఆ నిరుపేద, నిస్సహాయ తల్లిదండ్రుల వేదన సహృదయులైన మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ అండదండలు మాత్రమే వారిని ఈ సమస్య నుంచి కాపాడగలుగుతాయి.


ఈ పసిపాప తల్లి శంకరి మిమ్మల్ని అర్థిస్తోంది. ప్రమాదంలో ఉన్న ఆ పసివాడి చికిత్సకు మీ సాయం తప్ప మరో మార్గం లేదు. ఉదార హృదయంతో సహాయం చేసి వారిని ఆదుకోండి.


Updated Date - 2022-02-10T17:17:02+05:30 IST