Post Office Scheme: ఈ స్కీమ్‌తో ఐదేళ్లలో మీ డబ్బు రెట్టింపు.. ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్కీమ్ ఇదీ..

ABN , First Publish Date - 2022-10-01T02:27:16+05:30 IST

చక్కటి ఆదాయాన్ని (Income) ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ స్కీమ్స్‌‌కి (Investment schemes) చక్కటి ఆదరణ లభిస్తుంది.

Post Office Scheme: ఈ స్కీమ్‌తో ఐదేళ్లలో మీ డబ్బు రెట్టింపు.. ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్కీమ్ ఇదీ..

క్కటి ఆదాయాన్ని (Income) ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌‌కి (Investment schemes) చక్కటి ఆదరణ ఉంటుంది. ఆ పథకాల్లో పెట్టుబడులకు జనాలు మొగ్గుచూపుతారు. ఆ కోవకే చెందుతుంది ‘ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’(POMIS). ఈ స్కీమ్ ప్రవేశపెట్టి చాలాకాలమే అయ్యింది. ఖాతాదారులకు నెలవారీ  వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుండడంతో అన్ని వయసు సమూహాలనూ ఈ స్కీమ్‌ ఆకర్షిస్తోంది. ప్రభుత్వ స్కీమ్ కావడంతో పెట్టుబడి భద్రత విషయంలో కూడా ఎలాంటి ఢోకాలేదు. ఐదేళ్ల తర్వాత స్కీమ్ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత పెట్టుబడి మొత్తాన్ని చందాదారుడికి తిరిగి చెల్లిస్తారు. ఆకర్షిస్తున్న ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం...


5 ఏళ్లలో పెట్టుబడి రెట్టింపు..

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌(POMIS) ద్వారా సబ్‌స్ర్కైబర్ ప్రతినెలా తన ఖాతాలో జమయ్యే వడ్డీని  డబ్బు వృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే సబ్‌స్ర్కైబర్ పోస్టాఫీసులో ఆర్‌డీ(recurring deposit) ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రికరింగ్ డిపాజిట్ ఖాతాలో జమ చేస్తుండాలి. రికరింగ్ ఖాతాలపై పోస్ట్ ఆఫీస్ మంచి రిటర్నులు అందిస్తోంది. ఏడాది రికరింగ్ డిపాజిట్‌పై త్రైమాసికానికి 5.8 శాతం చక్రవడ్డీ లభిస్తుంది. దీంతో రూ.4.5 లక్షల పెట్టుబడితో ఇటు పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌ ఆదాయంతోపాటు రికరింగ్ డిపాజిట్‌పై కూడా ఆదాయాన్ని పొందొచ్చు. ఈ విధానంలో ఖాతాదారుడి పెట్టుబడి దాదాపు రెట్టింపు అవుతుంది. 


మూలపెట్టుబడి రూ.4,50,000పై 6.6 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.2,475 ఖాతాలో జమవుతుంది. ఇదే వడ్డీ రేటుతో జాయింట్ అకౌంట్ మూలధనం రూ.9 లక్షలు అయితే ప్రతి నెలా రూ.4,922 ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్‌తో ప్రారంభించాలనుకునే వ్యక్తులకు రూ.4,50,000 ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే రూ.9 లక్షల పెట్టుబడి ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతి నెల నుంచి మెచ్యూరిటీ తీరే వరకు ప్రతి నెలా వడ్డీ ఖాతాలో జమవుతుంది. ఖాతాలో జమయిన వడ్డీని తీసుకోకుంటే దానిపై అదనంగా ఎలాంటి వడ్డీ వర్తించదు. మైనర్ల పేరిట వారి సంరక్షకులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. స్కీమ్ ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు మెచ్యూరిటీ పూర్తవ్వకముందే చనిపోతే నామినీకి డబ్బులు ఖాతాను రద్దు చేస్తారు.

Updated Date - 2022-10-01T02:27:16+05:30 IST