గొంతుపై ఉబ్బెత్తుగా ఉండే ఆ భాగాన్ని ఎప్పుడైనా గమనించారా? అది మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ABN , First Publish Date - 2022-01-04T16:18:25+05:30 IST

గొంతుపై ఉబ్బెత్తుగా కనిపించే ఆ భాగాన్ని..

గొంతుపై ఉబ్బెత్తుగా ఉండే ఆ భాగాన్ని ఎప్పుడైనా గమనించారా? అది మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

గొంతుపై ఉబ్బెత్తుగా కనిపించే ఆ భాగాన్ని మనం చూసే ఉంటాం. కానీ దీనిని ఏమంటారు? శరీరంలో ఇది ఏ విధులను నిర్వహిస్తుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సైన్స్ భాషలో ఈ అవయవాన్ని ఆడమ్స్ యాపిల్స్ అని అంటారు. మనం ఏదైనా తినేటప్పుడు, తాగినప్పుడు లేదా మాట్లాడేటప్పుడు, ఈ అవయవం కదులుతుంటుంది, ఈ అవయవం టీనేజ్‌ నుంచే కనిపిస్తుంది. గొంతులో స్వర పేటిక ఉంటుంది. దీని సాయంతో  మనిషి మాట్లాడగలుగుతాడు. ఈ ఆడమ్స్ ఆపిల్స్.. స్వరపేటికను రక్షించే కవచంగా ఉపయోగపడుతుంది. అందుకే మనిషి ఏదైనా మాట్లాడినప్పుడు ఆ అవయవం కదులుతుంటుంది. కాగా ఈ ఆడమ్స్ యాపిల్స్ కేవలం పురుషులలో మాత్రమే ఉంటుందని, మహిళల్లో ఉండదనే అపోహ చాలామందిలో ఉంది. అయితే అది నిజం కాదు. ఇది ప్రతి మనిషిలోనూ కనిపిస్తుంది. అయితే స్త్రీలలో ఇది స్పష్టంగా కనిపించదు. అందుకే ఇది స్త్రీలలో ఉండదని అనుకుంటారు.


ఈ అవయవానికి ఆడమ్స్ యాపిల్స్ అని ఎందుకు పేరు పెట్టారు? అనే ప్రశ్న మదిలో మెదులుతుంది. దీనికి ఆడమ్, ఈవ్ తోటతో సంబంధం ఉందని చెబుతారు. ఆ తోటలో చాలా ఆపిల్ చెట్లు ఉంటాయి. ఆడమ్ ఒక యాపిల్ తింటుండగా అది అతని గొంతులో చిక్కుకుంటుంది. ఈ కారణంగా దీనికి ఆడమ్స్ యాపిల్స్ అని పేరు పెట్టారని అంటారు. కాగా కొంతమందిలో ఈ అవయవం పెద్దదిగా కనిపిస్తుంది. దీనికి కారణం కణజాలమేనని సైన్స్ చెబుతోంది. ఆడమ్స్ ఆపిల్స్ చుట్టూ కణజాలం అభివృద్ధి చెందినప్పుడు అది పరిమాణంలో పెద్దదిగా మారుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా దీని పరిమాణం పెద్దదిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని శస్త్రచికిత్స సహాయంతో తగ్గించవచ్చు. మీ ఆడమ్స్ యాపిల్స్ పరిమాణం సాధారణం కంటే పెద్దదిగా ఉందని మీరు భావిస్తే, వైద్యుడిని సంప్రదించండి. 

Updated Date - 2022-01-04T16:18:25+05:30 IST