TRS ప్లీనరీ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే..

ABN , First Publish Date - 2022-04-28T11:59:21+05:30 IST

TRS ప్లీనరీ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే..

TRS ప్లీనరీ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే..

హైదరాబాద్‌ సిటీ : ప్లీనరీ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రదర్శితమయ్యేలా డిజిటల్‌ డిస్‌ ప్లే ఏర్పాటు చేశారు. ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులకు కరపత్రంతోపాటు.. క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కేలండర్‌ను ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆన్‌లైన్‌ ఖాతాలతోపాటు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా ఖాతాల క్యూ ఆర్‌ కోడ్‌లూ కరపత్రంలో ఉన్నాయి. కేటీఆర్‌కు ఎంత మంది ఫాలోవర్లు ఉనారన్న విషయాన్నీ పొందుపర్చారు. అత్యధికంగా ట్విట్టర్‌లో కేటీఆర్‌కు 33.65 లక్షలు, ఫేస్‌ బుక్‌లో 10.71 లక్షలు, ఇన్‌స్టాలో 8.87 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌, టీఎ్‌సటీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌లతోపాటు ప్రతినిధులు టెక్‌సెల్‌ అప్‌లోడ్‌ చేసే వీడియోలు ఎలా చూడాలన్నది చెప్పారు.

Updated Date - 2022-04-28T11:59:21+05:30 IST