ప్రామాణికత లేని పీఆర్సీని పరిగణించలేం: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2022-01-25T20:49:16+05:30 IST

ప్రామాణికత లేని పీఆర్సీని తాము పరిగణించలేమని పీఆర్సీ

ప్రామాణికత లేని పీఆర్సీని పరిగణించలేం: సూర్యనారాయణ

అమరావతి: ప్రామాణికత లేని పీఆర్సీని తాము పరిగణించలేమని  పీఆర్సీ సాధన సమితి నేత  సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులు చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు నడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. పీఆర్సీ విషయంలో నాలుగు సంఘాల నేతలు మనసా వాచా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పీఆర్సీని  అమలు చేస్తుందా అనే విషయం స్పష్టం చేయాలన్నారు.  రాష్ట్ర పీఆర్సా,కేంద్ర పీఆర్సా, అశుతోష్ కమిటీ నివేదికా ఏది అమలు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు. ఏ విధానం అమలు చేయాలో తెలియక ప్రభుత్వం అయోమయంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఏ విధానం అమలు చేస్తోరో స్పష్టంగా చెబితే దానిపై ఉద్యోగ సంఘాలను తాను ఒప్పిస్తానన్నారు.


ఏ ప్రామాణికతో పదవీ విరమణ వయసును 62 ఏళ్లుకు ఎందుకు పెంచారో స్పష్టత ఇవ్వాలన్నారు.    సీఎస్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు  కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.  విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. 8 నెలల తర్వాత తెలంగాణకు ధీటుగా ఏపీకి ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-25T20:49:16+05:30 IST