చాణక్యనీతి: ఈ పొరపాట్లు ధనికులను కూడా పేదవారిగా మార్చేస్తాయి.. తరువాత చింతించి ప్రయోజనం లేదు!

ABN , First Publish Date - 2022-02-23T12:41:03+05:30 IST

డబ్బు సంపాదించాలంటే శ్రమ, తెలివితేటలు...

చాణక్యనీతి: ఈ పొరపాట్లు ధనికులను కూడా పేదవారిగా మార్చేస్తాయి.. తరువాత చింతించి ప్రయోజనం లేదు!

డబ్బు సంపాదించాలంటే శ్రమ, తెలివితేటలు, సామర్థ్యం అవసరం. ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అయినా వైఫల్యం చెందుతుంటాడు. ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు.. సంపాదనకు సంబంధించిన పలు విషయాలు తెలిపాడు. ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో.. ధనవంతుడైన కుబేరుడు కూడా ఒకానొక సమయంలో పేదరికంలో చిక్కుకున్నాడని తెలిపాడు. ఖర్చు చేయని ధనం అలానే ఉంచితే వృథాగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది.


సరైన పనుల్లో ఖర్చు చేసినప్పుడే డబ్బు సద్వినియోగం అవుతుంది. అలా చేయకపోతే ధనవంతుడు కూడా కొంత కాలానికి పేదవాడిలా మారిపోతాడు.  ఆచార్య చాణక్యుడు డబ్బు వృద్ధికి సంబంధించిన 3 విషయాలు తెలిపాడు. వాటిని సద్వినియోగం, దానం, వృథాగా అభివర్ణించాడు. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వానికి విరాళంగా ఇవ్వకపోతే, లేదా సరిగా ఉపయోగించకపోతే ఆ డబ్బు వృథా అవుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే ఎప్పుడూ ధనవంతునిగా ఉండాలనే కోరిక మీలో ఉంటే డబ్బును సద్వినియోగం చేసుకోవాలని చాణక్య సూచించాడు. డబ్బును పేదలకు దానం చేయడంతోపాటు మతపరమైన కార్యక్రమాలకు వినియోగించాలని ఆచార్య చాణక్య తెలిపారు. మరోవైపు డబ్బు సద్వినియోగం అంటే.. ఆహార ధాన్యాలు కొనడం, సరైన దుస్తులు కొనడం, విద్య, ఆరోగ్యం, మంచి జీవనం కోసం డబ్బు ఖర్చు చేయడమని ఆచార్య చాణక్య తెలిపారు. అయితే అనవసరంగా లేదా చెడు అలవాట్లకు డబ్బు ఖర్చు చేస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉండదని ఆచార్య హెచ్చరించారు. 

Updated Date - 2022-02-23T12:41:03+05:30 IST