రోజుకు 30 బాటిళ్ల పెప్సీ తాగే అలవాటు.. 20 ఏళ్లుగా ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు.. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-19T00:28:40+05:30 IST

సాధారణంగా మనం రోజులో 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తీసుకుంటాం.. అప్పుడప్పుడు కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం.

రోజుకు 30 బాటిళ్ల పెప్సీ తాగే అలవాటు.. 20 ఏళ్లుగా ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు.. ప్రస్తుతం ఇతడి ఆరోగ్య పరిస్థితి ఏంటంటే..

సాధారణంగా మనం రోజులో 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తీసుకుంటాం.. అప్పుడప్పుడు కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం.. కానీ, ఇంగ్లండ్‌కు చెందిన ఆండీ కర్రీ అనే వ్యక్తి పెప్సీని మంచినీళ్లలా తాగుతాడు.. రోజుకు సుమారు 30 బాటిళ్ల పెప్సీ తాగుతాడు.. గత 20 ఏళ్లుగా అతను మంచినీళ్లు తీసుకోకుండా పెప్సీ మాత్రమే తాగుతున్నాడు.. పెప్సీ కోసం రోజుకు సుమారు రూ.1900 ఖర్చు పెడుతుంటాడు.. గత 20 ఏళ్లుగా కేవలం పెప్సీ కోసమే ఏడాదికి రూ.6.7 లక్షల ఖర్చు పెడుతున్నాడు.


ఇది కూడా చదవండి..

RIP Internet Explorer: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు సమాధి కట్టించిన కొరియా ఇంజనీర్.. వైరల్ అవుతున్న ఫొటో..



నిద్ర లేచిన వెంటనే ఆండీ ఒక గ్లాసు పెప్సీ తాగిన తర్వాతే మిగిలిన పనులు పూర్తి చేస్తాడు. అలాగే పెప్సీ తాగిన తర్వాతే నిద్రపోతాడు. మధ్యలో దాహం వేసినపుడు కూడా పెప్సీనే తాగుతాడు. ఇలా గత 20 ఏళ్లలో అతను ఏకంగా 219,000 బాటిళ్ల పెప్సీ తాగేశాడు. మోతాదుకు మించి పెప్సీ తీసుకోవడం వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింది. బరువు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అతను ఆన్‌లైన్ హిప్నోథెరపీ క్లాస్‌కు హాజరై తన పెప్సీ అడిక్షన్‌ను తగ్గించుకుంటున్నాడు. 20 ఏళ్ల తర్వాత తొలిసారి మంచినీళ్లు తాగాడు. 



`గతంలో నేను నైట్ డ్యూటీలు ఎక్కువగా చేసేవాడిని. ఆ సమయంలో నిస్సత్తువ ఆవరించకుండా ఉండేందుకు పెప్సీ తాగేవాడిని. ఆ రుచి నాకు చాలా బాగా నచ్చింది. అప్పట్నుంచి దానికి బానిసనయ్యా. నేను పెప్సీ కోసం ఖర్చు పెట్టే డబ్బుతో ఏడాదికో కారు కొనుక్కోవచ్చు. ఈ పెప్సీ అలవాటు వల్ల నా బరువు 120 కిలోలకు చేరింది.  నా అలవాటు గురించి తెలుసుకుని డాక్టర్ నన్ను హెచ్చరించాడు. ఇప్పటికే చాలా అనర్థాలు జరిగాయని, ఇకపై జాగ్రత్తపడకపోతే శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. దాంతో ఆన్‌లైన్ హిప్నోథెరపీ క్లాస్‌కు హాజరై  క్రమక్రమంగా పెప్సీకి దూరమవుతున్నాన`ని ఆండీ చెప్పాడు. 

Updated Date - 2022-06-19T00:28:40+05:30 IST