LIC Policy: రోజుకు రూ.233 ఇన్వెస్ట్ చేస్తే రూ.17 లక్షలు.. ఎల్ఐసీ అందిస్తున్న ప్లాన్ వివరాలు ఇవే..

ABN , First Publish Date - 2022-10-08T01:16:50+05:30 IST

వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి చాలా కీలకం. అవగాహనలేమి కారణంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేదానిపై సతమతమవుతున్నవారి సంఖ్య పెద్దగానే ఉంటుంది.

LIC Policy: రోజుకు రూ.233 ఇన్వెస్ట్ చేస్తే రూ.17 లక్షలు.. ఎల్ఐసీ అందిస్తున్న ప్లాన్ వివరాలు ఇవే..

న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి ఎంపిక చాలా కీలకం. అవగాహనలేమి కారణంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేదానిపై సతమతమయ్యేవారి సంఖ్య పెద్దగానే ఉంటుంది. ఈ తరహా వ్యక్తుల ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ (LIC) ఎప్పటికప్పుడు చక్కటి ప్లాన్స్ ఆఫర్ చేస్తుంటుంది. సమాజంలోని అన్నీ ఆర్థిక వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్‌ను  రూపొందిస్తుంటుంది. అలాంటి ప్లాన్ కోసం అన్వేషించేవారి కోసం ‘ ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ’ (LIC Jeevan Labh Policy) ఒక చక్కటి పథకం. ప్రతి రోజూ రూ.233 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.17 లక్షల మొత్తాన్ని పొందొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలపై మీరూ ఓ లుక్కేయండి.


ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఏమిటి?.

ఈ పథకం ఒక నాన్-లింక్డ్ స్కీమ్. ఈ పాలసీకి స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉండదు. మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురయినా మీ డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్.


ఈ ప్లాన్ ప్రయోజనాలు..

- ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్‌లో లాభంతోపాటు డబ్బుకు రక్షణ కూడా ఉంటుంది.

- 8 - 59 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పాలసీ ప్రయోజనాలు పొందొచ్చు.

- ఈ పాలసీ టర్మ్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య తీసుకోవచ్చు.

- కనీస సమ్ అష్యూర్డ్ (sum assured) రూ.2 లక్షలు తీసుకోవాలి.

- గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు.

- 3 ఏళ్ల ప్రీమియం పేమెంట్‌పై లోన్ సౌకర్యం కూడా ఉంది.

- ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంటుంది. పాలసీదారుడు ప్రమాదవశాత్తూ చనిపోతే సమ్ అష్యూర్డ్, బోనస్‌లను నామినీ పొందొచ్చు.


ఉదాహరణ: రోజుకు రూ.233 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. అంటే నెలకు రూ.7 వేలు పెట్టుబడి పెడుతున్నట్టు. 16 సంవత్సరాల టర్మ్ పాలసీని ఎంపిక చేసుకుంటే పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యాక రూ.17 లక్షల మొత్తం చేతికి అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆదాయ పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్‌లో పెట్టుబడులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. స్టాక్ మార్కెట్లతో ముడిపడకపోవడంతో పెట్టుబడులు కూడా సురక్షితంగా ఉంటాయి.


డెత్ బెనిఫిట్స్..

పాలసీదారుడు చనిపోతే అప్పటివరకు చెల్లించిన ప్రీమియంలు అన్నీ తిరిగి చెల్లిస్తార. నామినీకి డెత్ సమ్ అష్యూర్డ్, సింపుల్ రెవెర్సినరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్‌లుగా డెత్ బెనిఫిట్స్‌గా అందుతాయి.

Updated Date - 2022-10-08T01:16:50+05:30 IST