Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి పూట గుళ్లో ప్రవచనాలు వినేందుకు వెళ్తానన్న భార్య.. సరేనన్న భర్త.. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పింది విని..

గుడిలో భాగవతం వినేందుకు వెళ్లి వస్తున్న ఒక వివాహిత తలకు తుపాకీ పెట్టి కాల్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఈ ఘటన గత బుధవారం రాత్రి బీహార్ రాజధాని పట్నా సమీపంలోని ఒక గ్రామంలో జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం

పట్నా సమీపంలోని రాంపూర్ అనే గ్రామంలో గత కొన్ని రోజులుగా ఒక గుడిలో భాగవత పారాయణం జరుగుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన సోనూ కుమార్ భార్య లలిత(పేరు మార్చబడినది) కూడా భాగవతం వినేందుకు గుడికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లింది. కానీ గుడికి వెళ్లింది భాగవతం కోసం కాదు ఒక వ్యక్తిని కలవడానికి. అతనెవరో కాదు తన ప్రేమికుడు.

సోను కుమార్, లలితల వివాహం 2012లో జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్తతో విసిగిపోయిన లలిత గ్రామంలోని మరో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో తరుచూ కలుస్తూ ఉండేది. బుధవారం రాత్రి కూడా తన ప్రేమికుడు పిలవగానే ఇంటి నుంచి భాగవతం వంక పెట్టి బయలుదేరింది. గుడి వద్ద వారిద్దరినీ చూసిన సోను కుమార్ మిత్రుడొకడు అతనికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే సోను గుడికి బయలుదేరాడు. తన భార్య గుడి వెనుక మరొక వ్యక్తితో శారీరకంగా కలవడం చూసిన సోను తట్టుకోలేకపోయాడు. తిరిగి ఇంటికి బయలుదేరాడు.

ఇంట్లో ఉన్న నాటు తుపాకీ తీసుకున్నాడు. లలిత భాగవతం ముగిశాక ఇంటికి బయలుదేరింది. ఇంటి వద్దకు రాగానే.. సోను ఆమె తలకు తుపాకీ పెట్టి కాల్చేశాడు. ఆ శబ్దానికి గ్రామస్తులు లేచి వచ్చారు. సోను అక్కడి నుంచి పారిపోయాడు. లలిత ఇంకా బ్రతికి ఉండడం గమనించిన గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి చేర్చారు. లలిత పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సోను కోసం గాలిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement