ఇదీ మన నేర పరిశోధక సంస్థల పనితీరు!

ABN , First Publish Date - 2021-03-25T06:16:38+05:30 IST

మహారాష్ట్ర పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పలేని మహా రసవత్తర నాటకమొకటి కొద్ది రోజులుగా ప్రదర్శితమవుతున్నది....

ఇదీ మన నేర పరిశోధక సంస్థల పనితీరు!

మహారాష్ట్ర పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పలేని మహా రసవత్తర నాటకమొకటి కొద్ది రోజులుగా ప్రదర్శితమవుతున్నది. తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించడం, సాక్ష్యాధారాలు తారుమారు చేయ డం, సాక్షిని హత్య చేయడం, నేరస్థులైన అధికారులను రక్షించడం, రాజకీయ నాయకుల కోసం వందల కోట్ల రౌడీ మామూళ్లు వసూలు చేసిపెట్టడం వంటి అనేక పనులు పోలీసు అధికారులు చేశారని, చేస్తున్నారని బైటపడుతున్నది. నలుగురైదుగురు అధికారులు అరెస్టయి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు సీనియర్ పోలీసు అధికారులకు స్థానచలనం కలిగింది. స్వయ ంగా హోంమంత్రికే ఈ నేరాలతో, చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సం బంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రోజులు గడుస్తుంటే ఇంకా ఏయే రహస్యాలు బైటపడతాయో తెలియదు. ఈ నాటకీయమైన కథ ఇప్పటికి ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని చిక్కు ముళ్లతో ఉందో చూస్తే భయమూ ఆశ్చర్యమూ కలుగుతాయి.


ముంబయి నగరంలో ఆల్టామౌంట్ రోడ్‌లోని ఆంటిలియా అనే ఇరవై ఏడు అంతస్తుల భవనం గురించి అందరికీ తెలుసు. అది ప్రపంచ సహస్ర కోటీశ్వరుల జాబితాలో అగ్రభాగాన ఉన్న ముకేశ్ అంబానీ నివాసభవనం. ఆ భవనం ముందు ఒక స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా ఆగి ఉండగా పట్టుకున్నామని, అందులో జెలిటిన్ స్టిక్స్ (పేలుడు పదార్థాలు), డబ్బుల కోసం అంబానీని బెదిరిస్తూ రాసిన లేఖ ఉన్నాయని ముంబయి పోలీసులు ఫిబ్రవరి 25న ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆ వాహనం ఎవరిదో, ఎందుకు అక్కడ పెట్టారో దర్యాప్తు చేసే బాధ్యతను ముంబాయి పోలీసు వ్యవస్థలోని క్రైం ఇంటిలిజెన్స్ యూనిట్‌కు అప్పగించారు. ఆ యూనిట్ సచిన్ హిందురావు వఝే అనే అసిస్టెంట్ పోలీస్ ఇనస్పెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తు ంది. ఆ స్కార్పియో మన్సుఖ్ హిరణ్ అనే థానేకు చెందిన కార్ల అలంకరణ సామగ్రి వ్యాపారిదని, తన వాహనం దొంగిలించబడిందని ఫిబ్రవరి 17నే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడని కూడ బైటపడింది. ఈ పేలుడు సామగ్రితో కూడిన అనుమానాస్పద వాహనం గురించి విచారణ జరుగుతుండగానే, మార్చ్ 5 న హిరణ్ మృతదేహం థానే సమీపంలో ఒక కాలువలో దొరికింది.


ఈలోగా ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనానికీ ఉగ్రవాదానికీ సంబంధం ఉందని ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు యాసిన్ భత్కల్‌కు సహచరుడైన తిహార్ జైలు ఖైదీ ఒకరు చెప్పారని, అందువల్ల ఈ కేసును ముంబాయి పోలీసుల నుంచి తమ పరిధిలోకి తీసుకుంటున్నామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మార్చ్ 12న రంగంలోకి దిగింది. ఈ కేసును అప్పటిదాకా దర్యాప్తు చేస్తున్న సచిన్ వఝేను ప్రశ్నించడానికి ఆ మర్నాడు ఎన్‌ఐఎ కార్యాలయానికి పిలిచారు. ఉదయం పదకొండింటికి వెళ్లిన వఝేను రాత్రి పదింటిదాకా ప్రశ్నలతో వేధించారని, చివరికి ఎటువంటి చట్టబద్ధ ప్రమాణాలు పాటించకుండా అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. పేలుడు పదార్థాలతో దొరికిన వాహనం గత కొద్ది నెలలుగా వఝే అధీనంలోనే ఉందని, అసలు అది వారం ముందు దొంగిలించబడిందనే ఫిర్యాదు కూడ నిజం కాదని, ఆ ఫిర్యాదును నమోదు చేసుకొమ్మని థానే పోలీసుల మీద ఒత్తిడి చేసినది వఝేనేనని, అసలు హిరణ్ చాలకాలంగా వఝేకు సన్నిహిత మిత్రుడని ఎన్‌ఐఎ రోజుకొక వార్త పత్రికలకు విడుదల చేయడం మొదలుపెట్టింది. 


ఈ మధ్యలో సచిన్ వఝేను సమర్థిస్తూ ముఖ్యమంత్రితో సహా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, విమర్శిస్తూ గత భాజపా ప్రభుత్వంలోని ముఖ్యమంత్రితో సహా మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. మహారాష్ట్ర పత్రికల్లో, ప్రసారసాధనాల్లో అటూ ఇటూ రాజకీయ నాయకులు మాత్రమే గాక, ముంబై పోలీస్ కమిషనర్‌గా, పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన జూలియో రెబెరోతో సహా ఎందరో పరిశీలకులు ఈ పరిణామాల మీద విపరీత వ్యాఖ్యానాలు చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన అవుతుండగా, ప్రభుత్వం వఝేకు మద్దతుగా నిలిచాడనే కారణంతో ముంబాయి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ను అప్రధానమైన శాఖకు మార్చింది. ఆ వెంటనే ఆయన తాను చేసిన పనులన్నీ హోం మంత్రి కనుసన్నల్లో చేశానని, అసలు హోంమంత్రి ముం బాయిలోని దాదాపు రెండు వేల బార్ రెస్టారెంట్ల నుంచి నెల మామూళ్లుగా వందలాది కోట్లు వసూలు చేసి ఇమ్మని అడిగాడని ఆరోపించాడు. గత మూడు నాలుగు వారాలలో ఇన్ని మలుపులు తిరిగిన కథ ఇంకెన్ని మలుపులు తిరగనున్నదో తెలియదు. ఈ మొత్తం చిత్రవిచిత్ర భయానక గాథలో సమాధానాలు లేని ప్రశ్నలు, ఆశ్చర్యకరమైన చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి. హారాష్ట్ర పోలీసు వ్యవస్థకు సంబంధించి ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పలేని మహా రసవత్తర నాటకమొకటి కొద్ది రోజులుగా ప్రదర్శితమవుతున్నది. తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించడం, సాక్ష్యాధారాలు తారుమారు చేయడం, సాక్షిని హత్య చేయడం, నేరస్థులైన అధికారులను రక్షించడం, రాజకీయ నాయకుల కోసం వందల కోట్ల రౌడీ మామూళ్లు వసూలు చేసిపెట్టడం వంటి అనేక పనులు పోలీసు అధికారులు చేశారని, చేస్తున్నారని బైటపడుతున్నది. నలుగురైదుగురు అధికారులు అరెస్టయి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కొందరు సీనియర్ పోలీసు అధికారులకు స్థానచలనం కలిగింది. స్వయంగా హోంమంత్రికే ఈ నేరాలతో, చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రోజులు గడుస్తుంటే ఇంకా ఏయే రహస్యాలు బైటపడతాయో తెలియదు. ఈ నాటకీయమైన కథ ఇప్పటికి ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని చిక్కు ముళ్లతో ఉందో చూస్తే భయమూ ఆశ్చర్యమూ కలుగుతాయి. ముంబయి నగరంలో ఆల్టామౌంట్ రోడ్‌లోని ఆంటిలియా అనే ఇరవై ఏడు అంతస్తుల భవనం గురించి అందరికీ తెలుసు. అది ప్రపంచ సహస్ర కోటీశ్వరుల జాబితాలో అగ్రభాగాన వైన సచిన్ వఝే అరెస్టయ్యే నాటికి పోలీసు శాఖలో కిందిస్థాయి అసిస్టెంట్ పోలీస్ ఇనస్పెక్టర్ మాత్రమే. 1990లో పోలీసు శాఖలో చేరిన వఝే మొదట రెండు సంవత్సరాలు గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో పని ప్రారంభించి, మితిమీరిన అధికారాన్ని, హింసను ప్రయోగించి ఉన్నతాధికారుల మెప్పు పొందాడు. అలా 1992లో ముంబాయి శివార్లలోని థానేకు బదిలీ అయి, అతి త్వరలోనే ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’గా పేరుపొందాడు. స్వయంగా జూలియో రెబిరో రాసిన ప్రకారం వఝేకు 1997 నుంచి 2004లో సస్పెన్షన్‌కు గురయ్యేవరకూ, కేవలం ఎనిమిది సంవత్సరాలలో 63 మందిని ఎన్‌కౌంటర్లలో చంపిన కుఖ్యాతి ఉంది. అయితే ఘాట్కోపర్‌లో 2002లో జరిగిన బాంబు పేలుళ్ల సందర్భంగా అరెస్టు చేసిన వారిలో ఖాజా యూనస్ అనే యువకుడిని లాకప్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో 2004లో మరొక పదమూడు మంది పోలీసు అధికారులతో పాటు వఝే సస్పెన్షన్‌కు గురయ్యాడు. 2007లో పునర్నియామకం కోసం దరఖాస్తు పెట్టుకుని, అది తిరస్కరణకు గురయ్యాక, 2008లో రాజీనామా చేసి శివసేన కార్యకర్తగా మారాడు. ప్రైవేట్ దర్యాప్తు సంస్థను నెలకొల్పి, ముంబాయిలో జరిగే కార్పొరేట్ నేరాల, బెదిరింపుల, అక్రమ వసూళ్ల కేసుల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించాడు. శివసేన అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేయడానికి కూడ ప్రయత్నించాడు. 2019 నవంబర్‌లో శివసేన- ఎన్‌సిపి – కాంగ్రెస్ ఐక్యసంఘటన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వఝే దశ తిరిగింది. ‘కొవిడ్ అసాధారణ ఒత్తిడిని తట్టుకోవడానికి అదనపు బలగాలు అవసరం’ అనే పేరుతో 2020 జూన్ 5న వఝే పునర్నియామకం జరిగింది. కీలకమైన క్రైం ఇంటిలిజెన్స్ యూనిట్ బాధ్యతలు అప్పగించారు. ఆ అధికారంతోనే నవంబర్ 4న వఝే ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేశాడు. ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన వఝే మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ - భాజపా శక్తులకు అంబానీ పేలుడు పదార్థాల వాహనం కేసు కలిసి వచ్చింది. క్షణాల మీద తిహార్ జైలు ఖైదీ ఒప్పుకోలు అనేది సృష్టించి అమిత్ షా నాయకత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఎన్‌ఐఎను రంగంలోకి దించారు. 


అలా ఈ కేసు ముంబాయి పోలీసులకూ ఎన్‌ఐఎకూ, శివసేనకూ ఆర్‌ఎస్‌ఎస్‌కూ, మహారాష్ట్ర ప్రభుత్వానికీ కేంద్రప్రభుత్వానికీ మధ్య ఘర్షణగా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నది. ఇక్కడ దొందూ దొందే. రెండు పక్షాలూ నేరస్థులను కాపాడే, నేరాన్ని బలోపేతం చేసే, లేని సాక్ష్యాధారాలను సృష్టించే పనిలో తమ శక్తి సామర్థ్యాలన్నీ చూపుతున్నాయి. ఇలా రోజురోజుకూ సంక్లిష్టమవుతున్న ఈ వ్యవహారంలో కొన్ని ప్రధానాంశాలను సాధారణ ప్రజలు గుర్తించి, అర్థం చేసుకోవలసి ఉంది. ప్రభుత్వాలు, అధికారవర్గాలు, పోలీసులు చెప్పేవన్నీ నిజాలేనని, వాటిని యథాతథంగా తీసుకోవచ్చునని చాల మంది నమ్ముతుంటారు. అధికారపు గొంతులో నుంచి వెలువడే ఏ అబద్ధాన్నయినా సార్వకాలిక సత్యమైనట్టు నమ్మి, విద్యావంతులు, మేధావులు కూడ దాని మీద సిద్ధాంతాలు తయారుచేస్తుంటారు. అలా నమ్మడానికి వీలు లేదని ఈ ఉదంతం వెయ్యిన్నొకటోసారి రుజువు చేస్తున్నది. ఒక నేరం జరిగిందనీ, ఫలానా వాళ్లు నేరస్థులనీ, వాళ్లు ఫలానా విధంగా ఆ నేరం చేశారనీ ప్రకటించే చట్టబద్ధ అధికారం ఉన్న, ఆ నేరాన్ని దర్యాప్తు చేసి, న్యాయస్థానం ముందు విచారణకు పెట్టి, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువు చేసి, నేరస్థులకు శిక్ష విధింపజేయవలసిన పోలీసులు, ఆ పనులేవీ సక్రమంగా చేయడం లేదని ఈ ఉదంతం చూపుతున్నది. జరగని నేరాలను జరిగినట్టుగా ప్రకటిస్తూ, జరిగిన నేరాలను కప్పిపెడుతూ, రాజకీయ దురుద్దేశాలతో కొందరిని నేరస్థులని ప్రకటిస్తూ, తమ ప్రకటనలకు మద్దతుగా కొన్ని ‘సాక్ష్యాధారాలను’ చూపెడుతూ నేరానికీ, శిక్షకూ, నేరపరిశోధనకూ, సత్యాన్వేషణకూ పోలీసులే అర్థాలు మారుస్తున్న భయానక పరిణామమిది. ‘చట్టబద్ధ పాలన’, ‘సకారణమైన సందేహాలకు అవకాశం లేని విచారణా ప్రక్రియ’ వంటి మాటలు హాస్యాస్పదమైపోతున్న పరిణామమిది. రెండు రాజకీయ పక్షాల మధ్య, రెండు పోలీసు ముఠాల మధ్య ఘర్షణలో సత్యం బలి అయిపోతున్న సందర్భమిది. 


ఇదంతా ఒకానొక రాష్ట్రానికి వర్తించే వ్యవహారం మాత్రమే కాదు, ఈ దేశంలో అధికారవ్యవస్థలు, ప్రత్యేకంగా మితిమీరిన అధికారాలు పోగేసుకుంటున్న పోలీసు వ్యవస్థ, ఎట్లా పని చేస్తున్నాయో చూపే దర్పణం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడ రాజకీయ, పోలీసు వ్యవస్థ బొక్కసాలలో ఇటువంటి బైటపడని కంకాళాలు ఎన్నెన్ని దాగి ఉన్నాయో, ఎప్పటికి బైట పడతాయో....

ఎన్ వేణుగోపాల్

Updated Date - 2021-03-25T06:16:38+05:30 IST