రిషబ్ పంత్‌కు ఇదే సరైన అవకాశం.. ఇదీ వేస్ట్ చేసుకుంటే..

ABN , First Publish Date - 2020-02-22T01:20:43+05:30 IST

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు.. టీం ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ

రిషబ్ పంత్‌కు ఇదే సరైన అవకాశం.. ఇదీ వేస్ట్ చేసుకుంటే..

వెల్లింగ్టన్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు.. టీం ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌లకే పెవిలియన్ చేరారు. దీంతో వర్షం కారణంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్‌లో అజింక్యా రహానే(38), రిషబ్ పంత్(10) ఉన్నారు.


ఈ క్రమంలో రిషబ్ పంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం జట్టు కష్టాల్లోఉన్న కారణంగా.. క్రీజ్‌లో రహానేతో పాటు ఉన్న పంత్ కచ్చితంగా తన బ్యాట్‌కి పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ కెప్టెన్ ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చాడంటూ.. అంతా పంత్ గురించి ఆరంభంలో గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ, అతను ఆడిన ఏ మ్యాచ్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. తొందరపాటు బ్యాటింగ్‌తో స్వల్పస్కోర్‌లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత గాయం కావడంతో తుది జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో పంత్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. 


అయితే ఇప్పుడు కష్టాల్లో ఉన్న జట్టుకు పంత్ అండగా నిలిస్తే.. అతనికి కాస్త ఊరట లభిస్తుంది. రహానేతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధిచేందుకు తోడ్పడితే.. అతన్ని జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని.. లేదా.. మళ్లీ అతను బెంచ్‌కు పరిమితం కావాల్సి వస్తుందని నిపుణుల అంచనా. దీంతో ఇది పంత్‌కు దక్కిన తుది అవకాశంగా అతను భావించి శనివారం బ్యాటింగ్ చేయాలని వారు అంటున్నారు. 

Updated Date - 2020-02-22T01:20:43+05:30 IST