ఇదే చివరి క్షణమనుకున్నా...

ABN , First Publish Date - 2021-08-31T08:26:37+05:30 IST

‘‘నర్సీపట్నం నుంచి నన్ను తిరిగి చింతపల్లి తీసుకొని వెళ్తున్నప్పుడు ‘నాకు ఇదే చివరి క్షణం’ అని అనుకున్నా.

ఇదే చివరి క్షణమనుకున్నా...

  • నక్సల్స్‌తో కాదు... పోలీసులతోనే ప్రమాదం
  • వారు భక్షక భటుల్లా మారారు
  • నా అరెస్టు వెనుక వైసీపీ కుట్ర: చింతమనేని
  • స్టేషన్‌ బెయిల్‌పై ప్రభాకర్‌ విడుదల


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘నర్సీపట్నం నుంచి నన్ను తిరిగి చింతపల్లి తీసుకొని వెళ్తున్నప్పుడు ‘నాకు ఇదే చివరి క్షణం’ అని అనుకున్నా. ఆ అడవుల్లో కాల్చేసి నక్సలైట్లు చేశారని చెపుతారేమోనని అనుమానించా. రాష్ట్రంలో పోలీసులు భక్షక భటులుగా మారిపోయారు’’ అని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం శ్రీ దారాలమ్మ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న ఆయనను ఆదివారం మధ్యాహ్నం నర్సీపట్నం వద్ద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్‌ను భీమడోలు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి తీసుకొచ్చిన పోలీసులు 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. అనంతరం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘నక్సల్స్‌తో ప్రమాదం అని చెబుతున్నారు. కానీ వారితో కాదు.. నాకు పోలీసులతోనే ప్రమాదం. నా అరెస్టు వెనుక అధికార పార్టీ కుట్ర ఉంది.’’ అని ఆరోపించారు.



Updated Date - 2021-08-31T08:26:37+05:30 IST