జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-04-04T10:49:17+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ తొలి పాజిటివ్‌ కేసు నమో దైంది. ఇటీవల మర్కజ్‌ తబ్లీక్‌ జమాత్‌కు వెళ్లి వచ్చి నవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా

జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు

పెరుగుతున్న కరోనా అనుమానితుల సంఖ్య   

ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు 

మంథని నుంచి ఒకరు, పెద్దపల్లి నుంచి కొందరి తరలింపు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కరోనా వైరస్‌ తొలి పాజిటివ్‌ కేసు నమో దైంది. ఇటీవల మర్కజ్‌ తబ్లీక్‌ జమాత్‌కు వెళ్లి వచ్చి నవారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణఅయ్యింది. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ముగ్గురు మర్కజ్‌కు వెళ్లి రాగా, ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే అనుమానితుల సంఖ్య పెరుగుతు న్నది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రచా రానికి వెళ్లివచ్చిన వారిలో ఒకరు మంథని పట్టణానికి చెందిన వారని గుర్తించిన అధికారులు అతడు జలు బు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా అతడిని సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒకరిద్దరు వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చారని సమాచారం అందుకున్న అధికారులు వారిని క్వారంటైన్‌ కేంద్రాని కి తరలించారు.


ఢిల్లీలో జరిగిన మత ప్రచారానికి జిల్లానుంచి ఆరుగురు వ్యక్తులు వెళ్లి వచ్చారని ప్రభు త్వం జిల్లా అధికారులకు పంపిన సమాచారం మేర కు ఐదుగురితో పాటు వారి కుటుంబ సభ్యులను వా ళ్లు కలిసిన పలువురిని క్వారంటైన్‌ కేంద్రాలకు తర లించిన విషయం తెలిసిందే. మరొకరు మహారాష్ట్ర లోని రాజూరలో చిక్కుకుపోయారు. అలాగే మంథని పట్టణానికి చెందిన మరొకరు జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాకు చెందిన వ్యక్తితో కలిసి ఢిల్లీకి వెళ్లి వచ్చా రని భూపాలపల్లికి చెందిన వ్యక్తి ద్వారా సమాచారం అందడంతో అతడిని అధికారులు ఐసోలేషన్‌కు తర లించారు. జిల్లాలో అనుమానితులు పెరుగుతుండ డంతో ఆందోళన వ్యక్తంఅవుతున్నది. హోం క్వారం టైన్‌లో 1,098 మంది ఉండగా, వారి వివరాలను సేక రిస్తున్నారు. ఇందులో పలువురి 14రోజుల క్వారంటైన్‌ ముగిసింది. అనుమానితుల సంఖ్య పెరుగుతుండడం తో పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహిసు ్తన్నారు. ప్రజలు అత్యవసరాలకు మినహా ఇతర అవ సరాలకు రాకుండా ఉండేందుకు కట్టడి చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురు కావడంలేదు. వరి కోతలు ఆరంభమయ్యాయి. వ్యవ సాయ పనులకు ఉపయోగించే వాహనాలను అను మతిస్తున్నారు.


ఈనెల రెండో వారంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో మురికికాలువలపై ఫాగింగ్‌ చేస్తున్నారు. పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పారిశుధ్య సిబ్బం ది ఉత్తమ సేవలను అందిస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వే నిర్వహి స్తున్నది. శుక్రవారం నాటికి జిల్లాలోగల 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 1,90,641  కుటుంబాల్లోని 7,59,980 మంది ఆరోగ్య స్థితిగతుల గురించి సర్వే చే శారు. ఇందులో 769 మంది వివిధ వ్యాధులతో బాధ పడుతున్నారని గుర్తించారు. వారికి మందులను అం దజేస్తున్నారు. సివియర్‌ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచిస్తూ, వారి వివ రాలను వైద్య ఆరోగ్య శాఖాధికారులకు అందిస్తు న్నారు. ఈ సర్వే సత్ఫలితాలను ఇస్తున్నది. ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం తెలుస్తు న్నది.


లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. వలస కార్మికులకు బియ్యం. నగదు పంపిణీ దాదాపు పూర్తి కావస్తున్నది. రేషన్‌ వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తు న్నారు. తిండి లేక అలమటిస్తున్న దినసరి కూలీలు, బిచ్చగాళ్లు, మతిస్థిమితం లేని వాళ్లను ఆదుకునేందు కు పలువురు స్వచ్ఛందంగా ముందుకువచ్చి భోజనాలు వండించి పెడుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శ్రమి స్తున్న పోలీసులు, వైద్య సిబ్బందికి కూడా కొందరు భోజనాలు పెడుతున్నారు. నిరుపేదలకు కూరగా యలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ ఉదా రతను చాటుకుంటున్నారు.

 

జిల్లాఓని ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉంటూ, అత్యవసరమైతే బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. హ్యాండ్‌ వాష్‌లు, శానిటైజర్లను వాడుతూ తమ ఆరోగ్యాలను ప్రజలు కాపాడుకుంటున్నారు. 

Updated Date - 2020-04-04T10:49:17+05:30 IST