ఇది బాస్‌ ఆజ్ఞ

ABN , First Publish Date - 2021-11-30T08:30:42+05:30 IST

వీసీగా యూనివర్సిటీ మనుగడ, ఉద్యోగుల సంక్షేమం, నిధుల సంక్షేమ బాధ్యతే మీదే కదా అని ఉద్యోగులు ప్రశ్నించగా... ‘నన్ను ఇక్కడ నియమించింది నా బాస్‌.

ఇది బాస్‌ ఆజ్ఞ

  • ఆయనే నా హీరో 
  • వర్సిటీ మనుగడ అనవసరం: వీసీ


వీసీగా యూనివర్సిటీ మనుగడ, ఉద్యోగుల సంక్షేమం, నిధుల సంక్షేమ బాధ్యతే మీదే కదా అని ఉద్యోగులు ప్రశ్నించగా... ‘నన్ను ఇక్కడ నియమించింది నా బాస్‌. అయనే నా హీరో. నా బాస్‌ అడిగాడు నేను ఇచ్చేస్తున్నాను. ఇది బాస్‌ ఆజ్ఞ. ఎవరు ఎన్ని చేసినాఅగను. ఉదయం ఫోన్‌ చేశారు. సాయంత్రానికి తెమ్మన్నారు. మా నాన్న  కోరిక మేరకు హెల్త్‌ వర్సిటీకి వీసీ అయ్యాను. నా హీరో చెప్పిందే నాకు వేదం. అదే నేను చేస్తా. వర్సిటీ సంక్షేమం నాకు అవసరం లేదు. అవన్నీ నాకు తర్వాతే. కావాలంటే రేపే రిజైన్‌ చేసేస్తా’ అని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డా.పి.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఇలా చేస్తే వర్సిటీ కార్యకలాపాలు ఆపేస్తామని ఉద్యోగులు హెచ్చరించగా.. ‘అది మీ ఇష్టం.. నాకు అనవసరం’ అంటూ వీసీ బదులిచ్చారు. 

Updated Date - 2021-11-30T08:30:42+05:30 IST