ఇది భారతమాత ఆలయం!

ABN , First Publish Date - 2021-07-17T05:30:00+05:30 IST

శివాలయంను చూసి ఉంటారు. రాముడి గుడిని దర్శించుకుని ఉంటారు.

ఇది భారతమాత ఆలయం!

శివాలయంను చూసి ఉంటారు. రాముడి గుడిని దర్శించుకుని ఉంటారు. కానీ భారతమాత గుడి గురించి ఎప్పుడైనా విన్నారా? అదేంటి? భారతమాత గుడి ఎక్కడుంది అంటారా? అయితే చదవండి.

వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ క్యాంపస్‌లో భారతమాత గుడి ఉంది. ఈ గుడిని యూనవర్సిటీ ఫౌండర్‌, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు శివప్రసాద్‌గుప్తా నిర్మించాడు. 

ఈ ఆలయ నిర్మాణం 1918లో మొదలుపెడితే 1924లో పూర్తయింది. ఈ గుడిని 1936లో మహాత్మాగాంధీ అధికారికంగా ప్రారంభించారు. 

ఆలయంలో మార్బుల్‌పై అఖండ భారతవానిని చెక్కిన మ్యాప్‌ ఉంటుంది. అఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు కూడా మ్యాప్‌లో చూడొచ్చు. హిమాలయాలు స్పష్టంగా తెలిసేలా మ్యాప్‌ను మలిచారు. ఏటా గణతంత్రదినోత్సవం రోజున, స్వాతంత్య్ర దినోత్సవం రోజున  సముద్ర భాగం తెలియడం కోసం నీళ్లతో నింపుతారు. భూభాగాన్ని పూలతో అలంకరిస్తారు. 

Updated Date - 2021-07-17T05:30:00+05:30 IST